కల నెరవేరింది!: 50 కోట్లకు చేరువలో ఎన్టీఆర్ చిత్రం!
హైదరాబాద్: ఓ వైపు తెలుగు సినిమా 100 కోట్ల మార్కును అందుకున్నా.....ఇప్పటి వరకు ఎన్టీఆర్ సినిమాలు రూ. 50 కోట్ల మార్కును కూడా అందుకోలేదు. ఎట్టకేలకు ‘నాన్నకు ప్రేమతో' చిత్రంతో ఎన్టీఆర్ తన కెరీర్లో తొలి సారి 50 కోట్ల మార్కను అందుకోబోతున్నారు. ఇక ఈ చిత్రం ఫస్ట్ వీక్ కలెక్షన్లలో ఏపీ నైజాంలో టాప్-5లో, వరల్డ్ వైడ్ చూసుకుంటే టాప్-4లో ఉంది.
‘నాన్ను ప్రేమతో' చిత్రం మంగళవారంతో బాక్సాఫీసు వద్ద తొలి వారం పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు ఈ చిత్రాని వరల్డ్ వైడ్ రూ. 42 కోట్ల షేర్ వచ్చింది. మరో 8 కోట్ల అవలీలగా వస్తాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మరో వైపు ఈ చిత్రం ఓవర్సీస్ లో 2 మిలియన్ మార్కుకు చేరువైంది. సినిమాకు మరో 12 కోట్లు వస్తే పూర్తిగా సేఫ్ జోన్లోకి వెళ్లినట్లే అంటున్నారు.

మంగళవారం వరకు నాన్నకు ప్రేమతో ఓవర్సీస్ లో $1,800,000 (రూ. 12 కోట్లుకు పైగా)కు చేరుకుంది. 2 మిలియన్ మార్కనును త్వరలోనే అందుకోబోతున్నాడు జూనియర్. ఏపీ,తెలంగాణ, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియాలో ఇతర ప్రాంతాలన్నింటిలో కలిపి ఇప్పటి వరకు రూ. 30 కోట్ల వరకు షేర్ వచ్చింది.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించగా, ఎన్టీఆర్ తండ్రి పాత్రలో రాజేంద్ర ప్రసాద్, విలన్ గా జగపతి బాబు, ఇతర ముఖ్య పాత్రల్లో రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్, సితార, అమిత్, తాగుబోతు రమేష్, గిరి, నవీన్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ: విజయ్ చక్రవర్తి, ఆర్ట్: రవీందర్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఎడిటింగ్: నవీన్ నూలి, పాటలు: చంద్రబోస్, డాన్స్: రాజు సుందరం, శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుధీర్, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుకుమార్.


Click it and Unblock the Notifications











