»   »  'నాన్నకు ప్రేమతో' నైజాం లో రిలీజ్ రికార్డ్

'నాన్నకు ప్రేమతో' నైజాం లో రిలీజ్ రికార్డ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : జూ.ఎన్టీఆర్ నటించి సంక్రాంతికి విడుదల అవుతున్న సినిమా 'నాన్నకు ప్రేమతో'. ఈ చిత్రం నైజాం ఏరియాలో ఎక్కువ ధియోటర్స్ లో విడుదల కాబోతోంది. 400 స్క్రీన్స్ నైజాం ఏరియాలో రిలీజ్ అవుతూ అభిమానులకు ఆనందం కలగచేస్తోంది. డిస్ట్రిబ్యూటర్స్ మరో 40 స్క్రీన్స్ ఈ ఏరియాలో కలుపబోతున్నారు. దాంతో 440 స్క్రీన్స్ తో నైజాంలో విడుదల అవుతోంది. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో... 'నాన్నకు ప్రేమతో' చిత్రాన్ని ఎనిమిది స్క్రీన్స్ లో 7 స్క్రీన్స్ ఆక్యుపై చేయబోతోంది.

సంక్రాంతి బరిలో ముందుగా జనవరి 13న వస్తున్న ఈ సినిమా ఎ మేరకు విజయం సాదిస్తుందో చూడాలి. సుకుమార్ తన మార్కు చూపిస్తాడని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. బాబయ్ తో పోటి పడుతున్న ఎన్టీఆర్ కు ఈ సినిమా రిలిజ్ పెద్ద సవాలే.


Nannaku Prematho Record release in Nizam

''సుకుమార్ కథ రాయడు. జీవితాన్ని రాస్తాడు. సుక్కు నాన్నగారి కొన ఊపిరి నుంచి పుట్టిన కథ ఇది'' అని ఎన్టీఆర్ అన్నారు. ‘‘నేను నటించిన 25వ చిత్రమిది. ఇన్ని చిత్రాలు కాదు కదా అసలు నేను నటుడిని అవుతానని కూడా అనుకోలేదు. నీ వెన్నంటి నేనున్నానని నాకు ధైర్యం చెప్పి పరిశ్రమకి పంపించింది మా నాన్నగారే. ఈ సినిమా తల్లిదండ్రులకి నీరాజనం'' అన్నారు ఎన్టీఆర్‌.


ఎన్టీఆర్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ జంటగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నాన్నకు ప్రేమతో..' ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్‌ మిలియన్‌ హిట్స్‌ దాటి దూసుకుపోతోంది. తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.

English summary
In Nizam alone, Nannaku Prematho film will open in more than 400 screens, making it a record release for an NTR film.
Please Wait while comments are loading...