»   » ‘నాన్నకు ప్రేమతో’ యూఎస్ఏ ప్రీమియర్ షో కలెక్షన్ ఎంతంటే?

‘నాన్నకు ప్రేమతో’ యూఎస్ఏ ప్రీమియర్ షో కలెక్షన్ ఎంతంటే?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నాన్నకు ప్రేమతో' చిత్రం బుధవారం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. తాజాగా యూఎస్ఏ ప్రీమియర్ షో వివరాలు బయటకు వచ్చాయి. యూఎస్ఏలో 47 లొకేషన్లలో ఈ చిత్రం ప్రీమియర్ షో నిర్వహించారు. ప్రీమియర్ షో ద్వారా $237000(రూ. 1.58 కోట్లు) వసూలైనట్లు తెలుస్తోంది.

నాన్నకు ప్రేమతో సినిమాపై విడుదలకు ముందు నుండే మంచి అంచనాలు ఉన్నాయి. విడుదలకు ముందే అన్ని ఏరియాలు కలిపి మొత్తం రూ. 54 కోట్ల బిజినెస్ జరిగింది. సినిమా విడుదలైన తర్వాత పాజిటివ్ టాక్ రావడంతో నిర్మాతలు, బయ్యర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


Nannaku Prematho USA Premiere 1st Day Collections

ప్రపంచ సినిమాకు సాధారణ ప్రేక్షకుడు సైతం ఎక్సపోజ్ అవుతున్న ఈ సమయంలో తెలుగు సినిమా తనను తాను మార్చుకనే ప్రయత్నం చేస్తోంది. ఆ క్రమాన్ని అందిపుచ్చుకుని సుకుమార్ వంటి దర్శకులు తమ స్టైలిష్ మేకింగ్ తో ముందుకు వచ్చాడు ఎన్టీఆర్ తనదైన శైలిలో అద్బుతమైన నటనను చూపెట్టాడు. సుకుమార్ కూడా ప్రతీ ఫ్రేమ్ చెక్కినట్లుగా అందంగా తీర్చిదిద్దాడు.


ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. జగపతి బాబు, రాజేంద్రప్రసాద్, రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్, సితార, అమిత్, తాగుబోతు రమేష్, గిరి, నవీన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ: విజయ్ చక్రవర్తి, ఆర్ట్: రవీందర్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఎడిటింగ్: నవీన్ నూలి, పాటలు: చంద్రబోస్, డాన్స్: రాజు సుందరం, శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుధీర్, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుకుమార్.

English summary
Nannaku Prematho USA Premiere 1st Day Collections. Jr NTR’s Nannaku Prematho USA Premiere First Day Box Office Collection Update – $237 k from 47 Locations.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu