»   » టాప్-3 పొజిషన్ దక్కించుకున్న ‘నాన్నకు ప్రేమతో’

టాప్-3 పొజిషన్ దక్కించుకున్న ‘నాన్నకు ప్రేమతో’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో' చిత్రం ఓవర్సీస్ మార్కెట్లొ ఆల్ టైం టాప్-3 పొజిషన్ దక్కించుకుంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాహుబలి, శ్రీమంతుడు తర్వాత ఓవర్సీస్ లో హయ్యెస్ట్ కలెక్షన్ సాధించిన చిత్రంగా మూడో స్థానంలో నిలిచింది.

ఓవర్సీస్ మార్కెట్లో(యూఎస్ఏ) బాహుబలి 6 మిలియన్ డాలర్లు, శ్రీమంతుడు 2.89 మిలియన్ డాలర్లు వసూలు చేసాయి. వీటి తర్వాత అత్తారింటికి దారేది 1.89 డాలర్లతో మూడో స్థానంలో ఉండేది. అయితే ఇపుడు ‘నాన్నకు ప్రేమతో' 2 మిలియన్ డాలర్స్ వసూలు చేసి మూడో స్థానంలో నిలిచింది.


వాస్తవానికి ‘నాన్నకు ప్రేమతో' చిత్రం ప్రతికూల పరిస్థితుల్లోనే విడుదలైందని చెప్పాలి. యూఎస్ఏలో భారీ కలెక్షన్ వచ్చే ప్రీమియర్ షో ఈ చిత్రం విషయంలో డిలే అయ్యాయి. అదే విధంగా సంక్రాంతి విడుదల కావడంతో థియేటర్లు తక్కువగా దొరికాయి. దీంతో పాటు ఇతర సినిమాలతో పోటీ...మరో వైపు అమెరికాలో మంచు తుఫాను కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లలేని పరిస్థితి. పరిస్థితి అనుకూలంగా ఉంటే ఈ చిత్రానికి కలెక్షన్లు మరింత ఎక్కువ వచ్చేవని అంటున్నారు.


Nannaku Prematho In USA Top 3 List

ఇప్పటి వరకు ఎన్టీఆర్ కు మాస్ ఆడియన్స్ ఫాలోయింగ్ మాత్రమే ఎక్కువగా ఉండేది. క్లాస్ ఆడియన్స్ ఫాలోయంగ్ కాస్త తక్కువగా ఉండేది. దీంతో ఎన్టీఆర్ గత సినిమాలు ఇప్పటి వరకు 50 కోట్ల మార్కను అందుకోలేక పోయాయి. అయితే ఈ సినిమాతో క్లాస్ ఫాలోయింగ్ బాగా పెరిగింది.


ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించగా, ఎన్టీఆర్ తండ్రి పాత్రలో రాజేంద్ర ప్రసాద్, విలన్ గా జగపతి బాబు, ఇతర ముఖ్య పాత్రల్లో రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్, సితార, అమిత్, తాగుబోతు రమేష్, గిరి, నవీన్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ: విజయ్ చక్రవర్తి, ఆర్ట్: రవీందర్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఎడిటింగ్: నవీన్ నూలి, పాటలు: చంద్రబోస్, డాన్స్: రాజు సుందరం, శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుధీర్, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుకుమార్.

English summary
Young Tiger Jr NTR's Nannaku Prematho has finally managed to get place in all time top 3 Telugu grossers in overseas. The Sukumar directorial is now third highest grosser after Baahubali ($6M) and Srimanthudu ($2.89M) in the region.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu