»   » నారా రోహిత్ గురించి ఓ నమ్మలేని నిజం : కృష్ణ, చిరంజీవి, ఇప్పుడు ఈ హీరోనే

నారా రోహిత్ గురించి ఓ నమ్మలేని నిజం : కృష్ణ, చిరంజీవి, ఇప్పుడు ఈ హీరోనే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : కలెక్షన్స్ తో మిగతా హీరోలంతా టాలీవుడ్ రికార్డ్ లు బ్రద్దలు కొట్టే పనిలో ఉంటే..నారా రోహిత్ మాత్రం తన వరస సినిమాలతో రికార్డ్ లు బ్రద్దలు కొడుతున్నాడు. ఇప్పుడు నారా రోహిత్ సినిమాలు లిస్ట్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. అతని స్పీడ్ మరే హీరో అందుకునే స్దితిలో లేరు.

అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ 1972లో ఒకే సంవత్సరం తను నటించిన 18 సినిమాలు రిలీజ్ చేసి రికార్డ్ నెలకొల్పారు. ఆ తర్వాత మెగా స్టార్ చిరంజీవి 1983లో 14 సినిమాలు ఒకే సంవత్సరంలో తను నటించిన సినిమాలు విడుదల అయ్యేలా చేసి రికార్డ్ కు దగ్గరకు వెళ్లారు. తదుపరి కాలంలో ఎవరూ అలాంటి సాహసం చేయలేదు.

కానీ ఇప్పుడు ఈ జనరేషన్ లో నారా రోహిత్ ఈ రికార్డ్ ని క్రేయేట్ చేయాలని డిసైడ్ అయ్యాడు. 2016లో నారా రోహిత్ నటించిన తొమ్మిది సినిమాలు ఈ సంవత్సరం రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. నమ్మబుద్ది కావటం లేదా... అయితే స్లైడ్ షోలో ఆయన సినిమాలు లిస్ట్ చూడండి.. మీరే ఆశ్చర్యపోతారు.

తుంటరి

తుంటరి

కుమార్ నాగేంద్ర దర్సకత్వంలో రూపొందిన ఈ చిత్రం రెండు వారాల క్రితం విడుదలైంది. తమిళ చిత్రం మాన్ కరాటే కు రీమేక్ ఇది.

సావిత్రి

సావిత్రి

దర్శకుడు పవన్ సాదినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మార్చి 25న విడుదలకు సిద్దమైంది. నందిత హీరోయిన్ గా చేస్తోంది

శంకర

శంకర

రెజీనా హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం క్రితం సంవత్సరమే విడుదలకావాల్సింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆగి ఈ సంవత్సరం వస్తోంది. తాతినేని సత్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఓ తమిళ రీమేక్ కావటం విశేషం.

పండుగలా వచ్చాడు

పండుగలా వచ్చాడు

నారా రోహిత్‌ సరసన ‘యాక్షన్‌ 3డి' ఫేం నీలం ఉపాధ్యాయ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాతో నారా రోహిత్‌ మరో కొత్త దర్శకుడికి అవకాశం కల్పించారు. ఈ చిత్రంతో దర్శకుడిగా కార్తీకేయ ప్రసాద్‌ పరిచయమవుతున్నాడు.

అప్పట్లో ఒకడుండేవాడు

అప్పట్లో ఒకడుండేవాడు

'అప్పట్లో ఒకడుండేవాడు' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో నారా రోహిత్‌తోపాటు శ్రీవిష్ణు మరో హీరో గా నటిస్తున్నారు. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. వశిష్ట మూవీస్‌ పతాకంపై హరి, సన్నీరాజు నిర్మిస్తున్నారు.

రాజా చెయ్యివేస్తే..

రాజా చెయ్యివేస్తే..

నారా రోహిత్‌ హీరోగా ప్రదీప్‌ దర్శకత్వంలో వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. చిత్రం షూటింగ్ పూర్తై విడుదలకు సిద్దంగా ఉంది.

వీరుడు

వీరుడు

ఒన్‌ స్టాప్‌ క్రియేషన్స్‌ పతాకంపై బి.వి.వి.చౌదరి దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.1 గా రూపొందుతున్న ''వీరుడు'' చిత్రంలో నారా రోహిత్ టైటిల్‌ రోల్‌ పోషించనున్నారు. 'ప్రేమను గెలిచాడు' అనేది ట్యాగ్‌లైన్‌. ఈ చిత్రానికి నిర్వహణ: ఎం.విజయ్‌వర్ధన్‌రావు, సమర్పణ: శ్రీమతి కమలాదేవి, నిర్మాత: ఉప్పాడ కనకరాజు, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: బి.వి.వి.చౌదరి!

కథలో రాజకుమారి

కథలో రాజకుమారి

ఈ చిత్రం ద్వారా మహేష్ సూరపనేని దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. హీరో క్యారెక్టరైజేషన్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. నారా రోహిత్ సరసన నమితా ప్రమోద్ హీరోయిన్ గా నటించనుంది. అన్నారు.

జో అత్యుతానంద

జో అత్యుతానంద

వారాహి చలన చిత్రం పతాకంపై శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. జ్యోతి, అచ్యుతరామారావు, ఆనంద వర్ధనరావు అనే మూడు పాత్ర ల చుట్టూ ఈ కథ తిరుగు తుందట. వారి పేర్లు వచ్చే విధంగా సినిమా టైటిల్‌ ఎంపిక చేసుకున్నాడు.

English summary
Nara Rohit has already done 9 movies in the year 2016 and it is not even the completion of first quarter.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu