»   » కమల్ నా భుజంపై చెయ్యేసారు

కమల్ నా భుజంపై చెయ్యేసారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: కమల్‌హాసన్‌ను కలిసి తన కలను నిజం చేసుకున్నానని 'లచ్చిందేవికి ఓ లెక్కుంది'చిత్రం హీరో నవీన్‌చంద్ర అన్నారు. కమల్‌హాసన్‌పై తనకున్న అభిమానాన్ని ఆయన ఫేస్‌బుక్‌ వేదికగా పంచుకున్నారు.

Awesomeness that hand on my shoulder phewww was so nerves n happy with in. Meeting Lokha Nayakudu Kamal Haasan garu is like a dream come true 󾌵

Posted by Naveen Chandra on 28 November 2015

ఇటీవల ఓ కార్యక్రమంలో కమల్‌తో దిగిన ఫొటోను నవీన్‌ పోస్ట్‌ చేశారు. కమల్‌ తన భుజంపై చేయి వేయడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని పేర్కొన్నారు.

నవీన్ చంద్ర తాజా చిత్రం విశేషాలకు వస్తే...

నవీన్‌ చంద్ర, లావణ్య త్రిపాఠిలు జంటగా నటిస్తున్న చిత్రం 'లచ్చిందేవికి ఓ లెక్కుంది'. ‘లోల్' అన్న టైటిల్‌తో ప్రచారం పొందుతోన్న ఈ చిత్రం ఆడియో ఇప్పటికే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ నేపధ్యంలో లోల్ టీమ్ డిసెంబర్ 11న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

Naveen Chandra happy to meet Kamal Hassan

ఈ సినిమా ఇప్పటికే షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని రిలీజ్‌కి సిద్ధమైంది. జగదీశ్‌ తలసిల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సాయిప్రసాద్‌ కామినేని నిర్మిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

దర్శకుడు మాట్లాడుతూ...రాజమౌళి, కీరవాణి గారితో ఉండటం వల్ల నేను పర్ ఫెక్టుగా తయారయ్యాను. మనకు తెలియకుండా కొన్ని లక్షల కోట్లు లక్షల కోట్లు పడి ఉన్నాయి. అదేంటనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. అందరికి నచ్చే విధంగా ఉంటుంది అన్నారు.

మయాఖ క్రియేషన్స్ బ్యానర్లో ప్రసాద్ కామినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం విశేషం. ఈ చిత్రంలో జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మాజీ, అజయ్, సంపూర్ణేష్ బాబు, మేల్కోటి, భద్రం, భాను తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి పాటలు శివశక్తి దత్తా, అనంత శ్రీరామ్, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, డాన్స్: తార, కృష్ణారెడ్డి, జానీ, సన్నీ, ఫైట్స్: పి.సతీష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఇ. మధుసూదనరావు, నిర్మాత: సాయి ప్రసాద్ కామినేని, రచన, దర్శకత్వం: జగదీష్ తలశిల.

English summary
Naveen Chandra tweeted:" Awesomeness that hand on my shoulder phewww was so nerves n happy with in. Meeting Lokha Nayakudu Kamal Haasan garu is like a dream come true 😊" . Naveen Chandra 's Lachhi
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu