»   » జనవరి 1న విడుదల చేయటంలో ఓ లెక్కుంది

జనవరి 1న విడుదల చేయటంలో ఓ లెక్కుంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: నవీన్‌ చంద్ర, లావణ్య త్రిపాఠిలు జంటగా నటిస్తున్న 'లచ్చిందేవికి ఓ లెక్కుంది' చిత్రం నూతన సంవత్సర కానుకగా జనవరి 1న విడుదల కానుందని ప్రకటించారు. నవీన్‌ చంద్ర ఈ విషయాన్ని తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా వెల్లడించారు.

#LOL on Jan 1st..!!


Posted by Naveen Chandra on 9 December 2015

అదేవిధంగా ఈ చిత్రం వర్కింగ్‌ స్టిల్స్‌ను లావణ్య త్రిపాఠి తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. టి. జగదీశ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సాయిప్రసాద్‌ కామినేని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.


మొదట లోల్ టీమ్ డిసెంబర్ 11న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అయితేచివరి నిముషంలో నిర్ణయం మార్చుకుని ఈ డేట్ ని ఖరారు చేసింది.


ఈ సినిమా ఇప్పటికే షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని రిలీజ్‌కి సిద్ధమైంది. జగదీశ్‌ తలసిల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సాయిప్రసాద్‌ కామినేని నిర్మిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.


Naveen Chandra's ‘LOL’ release date change

దర్శకుడు మాట్లాడుతూ...రాజమౌళి, కీరవాణి గారితో ఉండటం వల్ల నేను పర్ ఫెక్టుగా తయారయ్యాను. మనకు తెలియకుండా కొన్ని లక్షల కోట్లు లక్షల కోట్లు పడి ఉన్నాయి. అదేంటనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. అందరికి నచ్చే విధంగా ఉంటుంది అన్నారు.


మయాఖ క్రియేషన్స్ బ్యానర్లో ప్రసాద్ కామినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం విశేషం. ఈ చిత్రంలో జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మాజీ, అజయ్, సంపూర్ణేష్ బాబు, మేల్కోటి, భద్రం, భాను తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి పాటలు శివశక్తి దత్తా, అనంత శ్రీరామ్, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, డాన్స్: తార, కృష్ణారెడ్డి, జానీ, సన్నీ, ఫైట్స్: పి.సతీష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఇ. మధుసూదనరావు, నిర్మాత: సాయి ప్రసాద్ కామినేని, రచన, దర్శకత్వం: జగదీష్ తలశిల.

English summary
Naveen Chandra 's Lachhindeviki Oka Lekkundi (LOL) makers have decided to release the film on Jan 1st.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu