»   » నయనతార చిత్రం కలెక్షన్స్ : 15 రోజులు,113 కోట్లు

నయనతార చిత్రం కలెక్షన్స్ : 15 రోజులు,113 కోట్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నా :అజిత్‌ హీరోగా నయనతార కాంబినేషన్ లో విష్ణువర్దన్‌ దర్శకత్వంలో తాజాగా విడుదలైన 'ఆరంభం' కురిపించిన కాసుల వాన.. మరోమారు కోలీవుడ్‌ సత్తాను చాటింది. విడుదలైన పదిహేను రోజుల్లోనే రూ.113 కోట్లకు పైగా రాబట్టిందని కోలీవుడ్‌ వర్గాల అనధికార సమాచారం.

అలాగే నయనతార నటించిన మరో చిత్రం వసూళ్ల రాబడిలో వూహించని వేగాన్ని, విజయాన్ని సొంతం చేసుకుంది. అది మరేదో కాదు 'రాజారాణి'. శంకర్‌ సహాయకుడు అట్లీ దర్శకుడిగా పరిచయమైన తొలి చిత్రమే ఈ కొత్త దారిలో దూకుడు ప్రదర్శించింది. 75 రోజుల దిశగా వెళుతున్న ఈ సినిమా యాభై రోజుల్లో రూ. యాభై కోట్లు రాబట్టింది. చక్కని కథ ఉంటే చిన్న చిత్రమైనా ఫర్వాలేదని నిరూపించింది 'రాజారాణి'.

Aarambam

మూడేళ్లుగా వసూళ్ల ట్రెండ్‌ రోజురోజుకూ పెరుగుతోందనే చెప్పాలి. ఎంత రాబటిందో చూసి 'రోబో' విజయానికి ఆశ్చర్యపోయారే కానీ, 'ఎన్ని రోజులు ఆడింద'నే నాటి లెక్కలకు వెళ్లలేదు. ఎందుకంటే దక్షిణాదిలో పొరుగురాష్ట్రాల ఆదరణ ఎక్కువగా ఉన్న చిత్ర పరిశ్రమ తమిళమే. ఇందులో విజయ్‌ కూడా భాగస్వామిగా మారాడు. కేరళ, కన్నడలో అభిమానులున్న విజయ్‌కి.. ఎలాంటి పరిచయం లేకుండా తెలుగునాట కూడా విజయాన్ని తెచ్చిపెట్టింది 'తుపాకి'. గత దీపావళికి విడుదలైన ఈ సినిమా చక్కని విజయాన్ని నమోదు చేసింది. రూ.150 కోట్లకు పైగా రాబట్టి ఆశ్చర్యపరిచింది.

'విశ్వనటుడు' కమల్‌హాసన్‌ స్వీయ దర్శకత్వంలో నటించిన 'విశ్వరూపం' ప్రపంచవ్యాప్తంగా రూ. రెండొందల కోట్లకుపైగా వసూలు చేసింది. వేళ్లపై లెక్కించే సంఖ్యలో థియేటర్లలో వందరోజులు ఆడినా.. వసూళ్లు మాత్రం వర్షంలా కురిశాయి.

English summary
Ajith’s “Arrambam” has made an extraordinary business in Tamil Nadu and Kerala box office from its opening day. The movie has collected approximately 113 crore for these 15 days.Ajith starrer has received great feedback from both the critics and the audience. So, trade experts strongly believe it is likely to continue its good run at the box office and give out a tough competition for the other two Deepavali releases. Directed by Vishnuvardhan, the movie also has Arya, Nayanthara and Taapsee playing main characters, whereas Yuvan Sankar Raja has scored music for the film. Movie is produced by A. M. Rathnam.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu