»   » ‘నీదీ నాదీ ఒకే కథ’ బాక్సాఫీస్ రిపోర్ట్: అప్పుడే లాభాల్లో, అదనంగా మరో 70...

‘నీదీ నాదీ ఒకే కథ’ బాక్సాఫీస్ రిపోర్ట్: అప్పుడే లాభాల్లో, అదనంగా మరో 70...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Box Office Collections Of Needi Naadi Oke Katha

శ్రీవిష్ణు హీరోగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన 'నీదీ నాదీ ఒకే కథ' చిత్రానికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న ఈ చిత్రం హౌస్ ఫుల్ కలెక్షన్లతో బాక్సాఫీసు వద్ద అదరగొడుతోంది.

మూడో రోజే లాభాలు, అదనంగా 70 థియేటర్లు

మూడో రోజే లాభాలు, అదనంగా 70 థియేటర్లు

ప్రస్తుతం బాక్సాఫీసు రేసులో ఉన్న సినిమాల్లో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి డిమాండ్ ఏర్పడటంతో 3వ రోజు నుండి మరో 70 థియేటర్లు అదనంగా యాడ్ చేశారు. చిన్న బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లతోనే లాభాల్లోకి వెళ్లింది.

ఈ చిత్ర బడ్జెట్, వసూళ్లు

ఈ చిత్ర బడ్జెట్, వసూళ్లు

ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ వీకెండ్ రూ. 1.90 కోట్ల షేర్ సాధించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.60 కోట్ల షేర్ కలెక్ట్ అవ్వగా... ఓవర్సీస్‌లో రూ. 30 లక్షలు వసూలైంది. ఈ చిత్ర బడ్జెట్ విషయానికొస్తే... నిర్మాణం, పబ్లిసిటీకి కలిపి నిర్మాతలు రూ. 2.25 కోట్లు ఖర్చు చేశారు.
లాభాల బాటలో

లాభాల బాటలో

ఆల్రెడీ రూ. 1.90 కోట్ల షేర్ రావడం, హిందీ డబ్బింగ్ రైట్స్ రూ. 40 లక్షలకు అమ్ముడు పోవడంతో ఈ చిత్రం ద్వారా నిర్మాతల చేతికి ఇప్పటికే రూ. 2.30 కోట్లు వచ్చి లాభాలు వచ్చేశాయి. మరో వైపు శాటిలైట్ రైట్స్ ఇంకా అమ్ముడు కావాల్సి ఉంది. ఇకపై వచ్చే బాక్సాఫీసు కలెక్షన్లు, శాటిలైట్ రైట్స్ నిర్మాతలకు అదనపు లాభమే అని చెప్పక తప్పదు.
అందరికీ కనెక్ట్ అవుతోంది

అందరికీ కనెక్ట్ అవుతోంది

దర్శకుడు వేణు ఊడుగుల సగటు సమాజంలో తండ్రి-కొడుకుల మధ్య జరిగే సంఘర్షణను తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ చిత్రంలో ఇటు యువతను, అటు ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఉండటంతో బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు సాధిస్తోంది.


English summary
Needi Naadi Oke Katha has received warm welcome from the audience. With positive reviews from critics and good word of mouth the film has been running successfully with houseful theaters. 70 extra theaters have been added across Telugu states on third day with increasing public demand. NNOK has already entered profit zone with good collections in the first weekend itself.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X