»   »  కొత్త సినిమా బాధలు!?!

కొత్త సినిమా బాధలు!?!

Posted By:
Subscribe to Filmibeat Telugu
కొత్తగా వచ్చిన చిత్రాలు టక్కరి, మైసమ్మ ఐపియస్ సినిమాలు ప్రేక్షకుడిపై పెద్దగా ప్రభావం చూపే స్థాయిలో లేకపోవడంతో అంతకుముందున్న సినిమాలే హవా కొనసాగిస్తున్నాయి. టక్కరి సినిమా తొలివారం 65 శాతం మేర వసూళ్లను రాబట్టినప్పటికీ ఈ సినిమా ఏం చేస్తుందన్నది రెండో వారంలో కానీ తెలియదు. అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో వచ్చిన టక్కరి సినిమా కథ ఆకట్టుకునే రీతిలో లేకపోవడమే పెద్ద లోపంగా మారింది. మైసమ్మ సినిమా కూడా వల్గర్ సినిమాగా ప్రచారం పొందింది. భరత్ చేసిన మరో ప్రయత్నం కూడా ఫెయిలైనట్టే లెక్క. సీమశాస్త్రి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బొల్తాకొడుతోంది. నవవసంతం ఆది నుంచి అనుకున్న రీతిలో ఆకట్టుకోనట్టే మూడో వారంలోనూ అసంతృప్తినే కలిగిస్తోంది. చాపకింద నీరులా ప్రవేశించిన హ్యాపీడేస్ సినిమా తన హవాను కొనసాగిస్తోంది. తులసి సినిమా 30 శాతం వసూళ్లతో 50 రోజులు అయిందనిపించింది. అతిథి పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే సాగుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X