twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బంగార్రాజు సహా సంక్రాంతి సినిమాలకు మళ్ళీ ముప్పు.. ఇక ఇబ్బందే!

    |

    దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కరోనా కేసుల వ్యవహారం సంక్రాంతి సినిమాల కలెక్షన్ల మీద ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది.. ఆ వివరాల్లోకి వెళితే

    కేసులు పెరుగుదల

    కేసులు పెరుగుదల

    దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సైతం భారీ ఎత్తున కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో సామాన్య ప్రజల్లో కూడా టెన్షన్ నెలకొంది.

    ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకసారి నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసి తర్వాత పండుగ నేపథ్యంలో దాన్ని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తాజా ఉత్తర్వుల ప్రకారం 18వ తేదీ నుంచి అంటే మంగళవారం నుంచి నైట్ కర్ఫ్యూ, థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

    నిరవధికంగా మూసి వేయడంతో

    నిరవధికంగా మూసి వేయడంతో

    మరోపక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని థియేటర్లను మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. తెలుగు సినిమాలకు కర్ణాటకలో కూడా ఒక మాదిరి మార్కెట్ ఉంటుంది.

    బాహుబలి లాంటి పెద్ద సినిమాలు విడుదలై సూపర్ హిట్ అందుకున్న తరువాత దాదాపు తెలుగు తెలుగులో పెద్ద హీరోకి సంబంధించిన అన్ని సినిమాలు కూడా కర్ణాటకలో కూడా విడుదలవుతున్నాయి.. ఇప్పుడు అక్కడ థియేటర్లను నిరవధికంగా మూసి వేయడంతో ఆ ప్రభావం కలెక్షన్ల మీద పడే అవకాశం ఉందని అంటున్నారు.

    ఆసక్తికర సినిమాలు

    ఆసక్తికర సినిమాలు

    ఈ సంక్రాంతికి బంగార్రాజు సినిమాలతో పాటు పలు చిన్న సినిమాలు విడుదలయ్యాయి. దిల్ రాజు వారసుడు ఆశిష్ రెడ్డి హీరోగా తెరకెక్కిన రౌడీ బాయ్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా తెరకెక్కిన హీరో సినిమా పండుగకు విడుదలయ్యాయి. అలాగే మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన సూపర్ మచ్చి, అలాగే హాట్ స్టోరీస్ అనే మరో సినిమా కూడా విడుదల అయ్యింది.

    ఆకట్టుకునే ఫీట్

    ఆకట్టుకునే ఫీట్

    ఇప్పుడు తాజాగా అందుతున్న అంచనాల మేరకు బంగార్రాజు సినిమా సహా రౌడీ బాయ్స్ హీరో సినిమాలకు ఈ ఆంధ్ర ప్రదేశ్ 50 శాతం ఆక్యుపెన్సీ, అలాగే కర్ణాటకలో పూర్తిగా మూసివేయబడిన థియేటర్ల విషయంలో కచ్చితంగా ప్రభావం ఉంటుందని అంటున్నారు. నాగార్జున , నాగ చైతన్యల బంగార్రాజు బాక్సాఫీస్ వద్ద కలకలం సృష్టించిందనే చెప్పాలి. ఈ సినిమ రిలీజ్ అయిన మొదట రోజునే ప్రపంచవ్యాప్తంగా రూ. 8.2 కోట్ల షేర్ సాధించింది, ఇది చాలా మంచి విషయం అంటే చెప్పాలి.

    అసలు సమస్య జనవరి 18 నుండి

    అసలు సమస్య జనవరి 18 నుండి

    సంక్రాంతి సీజన్ విడుదల ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో స్పష్టంగా సహాయపడుతోంది. కానీ బంగార్రాజుకి అసలు సమస్య జనవరి 18 నుండి మొదలవుతుంది, ఆంధ్రప్రదేశ్‌లో 50% సీటింగ్ కెపాసిటీ రెగ్యులేషన్ మరియు నైట్ కర్ఫ్యూ అమలులోకి వస్తుంది. బంగార్రాజు సినిమాకి ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో బాగా కలెక్షన్స్ వస్తునాయి. ఇక సీటింగ్ కెపాసిటీ పరిమితులు అమలులోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో అంతగా కలెక్షన్స్ రాకపోవచ్చు. ఇప్పుడు బంగార్రాజుకి ఇదే పెద్ద ముప్పు అని చెబుతున్నారు.

    English summary
    New tensions for sankranthi tollywood releases.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X