Don't Miss!
- News
సుప్రీంకోర్టులో పిటీషన్ వేయడమూ కేంద్ర ప్రభుత్వం దృష్టిలో తప్పే: టైమ్ వేస్ట్ అట..!!
- Sports
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా స్టార్ ఓపెనర్!
- Lifestyle
హీమోగ్లోబిన్ తక్కువైతే ప్రమాదమే..కార్డియాక్ అరెస్ట్ కు కారణం అవుతుంది. కాబట్టి, ఈ ఆహారాలు తినండి..
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Finance
Q3 Results: అదరగొట్టిన L&T.. మిస్ కొట్టిన టెక్ మహీంద్రా.. గెయిల్ కు ఎదురుదెబ్బ..
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
18 Pages Collections: నిఖిల్‌కు కలిసొచ్చిన సండే.. 10వ రోజు సంచలన వసూళ్లు.. లాభమెంతో తెలిస్తే!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది యంగ్ హీరోలు వరుస చిత్రాలతో సందడి చేస్తోన్నారు. కానీ, అందులో కొంత మంది మాత్రమే విశేషమైన గుర్తింపుతో పాటు మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను పెంచుకుంటోన్నారు. వారిలో నిఖిల్ సిద్దార్థ్ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచీ తన ప్రత్యేకతను చాటుకుంటోన్న అతడు.. ఎన్నో హిట్లను కూడా ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు నిఖిల్ '18 పేజెస్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ఆరంభం నుంచే మంచి స్పందన దక్కుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ 10 రోజుల్లో ఎంత రాబట్టిందో చూడండి!

18 పేజెస్‌తో వచ్చిన యంగ్ హీరో
టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో పల్నాటి సూర్య ప్రతాప్ తీసిన మూవీనే '18 పేజెస్'. ఈ మూవీని జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా చేసింది. ఈ మూవీలో దినేష్ రాజ్, అజయ్, పోసాని, బ్రహ్మాజీలు కీలక పాత్రల్లో నటించారు. దీనికి గోపీ సుందర్ మ్యూజిక్ ఇచ్చాడు.
Bigg Boss 7: బిగ్ బాస్ సంచలన నిర్ణయం.. కొత్త హోస్టుగా మంచు హీరో.. బాలకృష్ణ చేసిన పని వల్లే ఇలా!

నిఖిల్ మూవీకి ముందే లాభాలు
యంగ్ హీరో నిఖిల్ నటించిన '18 పేజెస్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు నెలకొన్నాయి. దీంతో నాన్ థియేట్రికల్ రైట్స్‌కు అదిరిపోయే బిజినెస్ జరిగింది. ముఖ్యంగా 'కార్తికేయ 2' మూవీ ప్రభావంతో ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి. ఫలితంగా అలా ఈ మూవీ ద్వారా నిర్మాతలకు దాదాపు రూ. 6 కోట్ల వరకు టేబుల్ ప్రాఫిట్ వచ్చినట్లు సమాచారం.

10వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది
'18 పేజెస్' సినిమాకు 10వ రోజు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు 3 రెట్లు పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 43 లక్షలు, సీడెడ్‌లో రూ. 9 లక్షలు, ఉత్తరాంధ్రాలో రూ. 7 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో మొత్తంగా రూ. 75 లక్షలు షేర్, రూ. 1.38 కోట్లు గ్రాస్ వసూలైంది.
మళ్లీ తెగించిన అషు రెడ్డి: అమాంతం షర్ట్ విప్పేసి ఎద అందాల ఆరబోత

10 రోజుల్లో ఎంత వసూలైంది?
10 రోజుల్లో '18 పేజెస్' మూవీ తెలుగు రాష్ట్రాల్లో బాగానే రాణించింది. ఫలితంగా నైజాంలో రూ. 4.15 కోట్లు, సీడెడ్‌లో రూ. 78 లక్షలు, ఉత్తరాంధ్రాలో రూ. 84 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 53 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 29 లక్షలు, గుంటూరులో రూ. 37 లక్షలు, కృష్ణాలో రూ. 31 లక్షలు, నెల్లూరులో రూ. 19 లక్షలతో మొత్తంగా రూ. 7.46 కోట్లు షేర్, రూ. 14.15 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా
నిఖిల్ - అనుపమ జోడీగా వచ్చిన '18 పేజెస్' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 10 రోజుల్లో రూ. 7.46 కోట్లు వసూలు అయ్యాయి. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 69 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.38 కోట్లు వచ్చాయి. వీటితో కలుపుకుంటే 10 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 9.53 కోట్లు షేర్‌తో పాటు రూ. 25 కోట్ల గ్రాస్ వసూలు అయింది.
హీరోయిన్‌పై వర్మ సంచలన పోస్ట్: ఆమె రెండు కాళ్లను ఎడం చేసి.. F** అంటూ ఘోరంగా!

మరింతగా పెరుగుతోన్న లాభం
'కార్తికేయ 2' వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత నిఖిల్ హీరోగా చేసిన '18 పేజెస్' మూవీకి నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే పెట్టుబడులు వచ్చేశాయి. దీనికితోడు ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ సొంతంగా విడుదల చేసుకుంది. దీంతో మొదటి రోజు నుంచే ఈ మూవీకి లాభాలు సొంతం అవుతున్నాయి. ఇలా ఇప్పటి వరకూ ఇది దాదాపు పది కోట్ల వరకూ లాభాలు అందుకుంది.