Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
18 Pages 12 Days Collections: నిఖిల్ సినిమాకు షాక్.. 12వ రోజు మరో రికార్డు.. మరో 5 లక్షలు వస్తే!
సాదాసీదాగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. విలక్షణమైన నటనతో విభిన్నమైన చిత్రాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్. కెరీర్ ఆరంభం నుంచీ విభిన్నమైన చిత్రాలను చేస్తోన్న అతడు.. ఎన్నో విజయాలను కూడా ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే 'కార్తికేయ 2'తో భారీ హిట్ కొట్టాడు. ఈ జోష్‌లోనే ఇప్పుడు నిఖిల్ '18 పేజెస్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. దీనికి మంచి స్పందన దక్కుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ 12 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూడండి!

18 పేజెస్ అంటూ వచ్చిన హీరో
నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా పల్నాటి సూర్య ప్రతాప్ రూపొందించిన క్రేజీ మూవీనే '18 పేజెస్'. ఈ మూవీని జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా చేసింది. ఈ మూవీలో దినేష్ రాజ్, అజయ్, పోసాని, బ్రహ్మాజీలు కీలక పాత్రల్లో నటించారు. దీనికి గోపీ సుందర్ సంగీతాన్ని సమకూర్చాడు.
స్విమ్మింగ్ పూల్‌లో హాట్‌గా భూమిక: తడిచిన బట్టల్లో యమ ఘాటుగా!

నిఖిల్ మూవీకి ముందే లాభాలు
టాలెంటెడ్ గాయ్ నిఖిల్ నటించిన '18 పేజెస్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు నెలకొన్నాయి. దీంతో నాన్ థియేట్రికల్ రైట్స్‌కు అదిరిపోయే బిజినెస్ జరిగింది. ముఖ్యంగా 'కార్తికేయ 2' మూవీ ప్రభావంతో ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి. ఫలితంగా అలా ఈ మూవీ ద్వారా నిర్మాతలకు దాదాపు రూ. 6 కోట్ల వరకు టేబుల్ ప్రాఫిట్ వచ్చినట్లు తెలిసింది.

12వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది
నిఖిల్ సిద్ధార్థ్ - అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన '18 పేజెస్' సినిమాకు ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఈ చిత్రం మంచి వసూళ్లనే రాబడుతూ వస్తోంది. ఫలితంగా నిర్మాతలకు లాభాలను అందిస్తోంది. ఈ నేపథ్యంలో 12వ రోజు తెలుగు రాష్ట్రాల్లో దీనికి రూ. 18 లక్షలు షేర్ మాత్రమే వసూలైంది.
జాకెట్ లేకుండా యాంకర్ శ్యామల: తొలిసారి ఇలా తెగించి మరీ హాట్ షో

12 రోజుల్లో ఎంత వసూలైంది?
'18 పేజెస్' మూవీ 12 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో బాగానే రాణించింది. ఫలితంగా నైజాంలో రూ. 4.43 కోట్లు, సీడెడ్‌లో రూ. 85 లక్షలు, ఉత్తరాంధ్రాలో రూ. 88 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 55 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 31 లక్షలు, గుంటూరులో రూ. 40 లక్షలు, కృష్ణాలో రూ. 33 లక్షలు, నెల్లూరులో రూ. 21 లక్షలతో మొత్తంగా రూ. 7.96 కోట్లు షేర్, రూ. 15.10 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా
నిఖిల్ - అనుపమ జంటగా నటించిన '18 పేజెస్' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 12 రోజుల్లో రూ. 7.96 కోట్లు వసూలు అయ్యాయి. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 72 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.46 కోట్లు వచ్చాయి. వీటితో కలుపుకుంటే 12 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.14 కోట్లు షేర్‌తో పాటు రూ. 19.95 కోట్లు గ్రాస్ వసూలు అయింది.
హీరోయిన్‌పై వర్మ సంచలన పోస్ట్: ఆమె రెండు కాళ్లను ఎడం చేసి.. F** అంటూ ఘోరంగా!

మరింతగా పెరుగుతోన్న లాభం
'కార్తికేయ 2' వంటి పాన్ ఇండియా హిట్‌తో రేంజ్ పెంచుకున్న నిఖిల్ '18 పేజెస్' మూవీకి నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే పెట్టుబడులు వచ్చేశాయి. దీనికితోడు ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ సొంతంగా విడుదల చేసుకుంది. దీంతో మొదటి రోజు నుంచే ఈ మూవీకి లాభాలు సొంతం అవుతున్నాయి. ఇలా ఇప్పటి వరకూ ఇది దాదాపు పది కోట్ల వరకూ లాభాలు దక్కించుకుంది.