Don't Miss!
- News
నేను బతికితే ఏంటీ? చస్తే ఏంటీ?: కేసీఆర్‌పై రాజా సింగ్ సంచలన ఆరోపణ
- Sports
INDvsNZ : ‘షోలే2’ వచ్చేస్తుంది.. బాలీవుడ్ సీన్ రీక్రియేట్ చేసిన టీమిండియా కెప్టెన్!
- Finance
upi limit: UPI తో ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసా ? అంతకు మించి పంపాలంటే..
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
18 Pages Official Collections: 2వ రోజు భారీగా.. టార్గెట్‌కు చాలా దూరమే.. నిర్మాతలకు అలా లాభాలు
టాలీవుడ్‌లో ఎంతో మంది టాలెంటెడ్ హీరోలు ఉన్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే వరుసగా విజయాలను సొంతం చేసుకుంటూ సత్తా చాటుతోన్నారు. అలాంటి వారిలో నిఖిల్ సిద్దార్థ్ ఒకడు. ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న అతడు.. 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా రేంజ్‌లో హిట్ కొట్టాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు అతడు '18 పేజెస్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. ఈ క్రమంలోనే రెండో రోజు కూడా ఈ మూవీ బాగానే హోల్డ్ చేసింది. ఈ నేపథ్యంలో 18 పేజెస్ 2 రోజుల రిపోర్టుపై లుక్కేద్దాం పదండి!

18 పేజెస్ అంటూ కొత్త ప్రయోగం
నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా పల్నాటి సూర్య ప్రతాప్ రూపొందించిన చిత్రమే '18 పేజెస్'. ఈ మూవీని జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా చేసింది. దీనికి గోపీ సుందర్ సంగీతాన్ని అందించాడు. ఇక, ఈ మూవీలో దినేష్ రాజ్, అజయ్, పోసాని, బ్రహ్మాజీలు కీలక పాత్రలు పోషించారు.
కొత్త లవర్‌తో హీరోయిన్ అరాచకం: ప్యాంట్ తీసేసి మరీ.. మరీ ఇంత దారుణమా!

నిఖిల్ మూవీ బిజినెస్ వివరాలు
నిఖిల్ నటించిన '18 పేజెస్' మూవీపై నెలకొన్న అంచనాల ప్రకారం.. దీనికి నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 5 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 10.00 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.50 కోట్లతో కలిపి ఓవరాల్‌గా రూ. 12.00 కోట్ల బిజినెస్ జరిగింది.

2వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది
'18 పేజెస్' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు మంచి వసూళ్లే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 60 లక్షలు, సీడెడ్‌లో రూ. 10 లక్షలు, ఉత్తరాంధ్రాలో రూ. 12 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 8 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో మొత్తంగా రూ. 1.06 కోట్లు షేర్, రూ. 2.10 కోట్లు గ్రాస్ వచ్చింది.
హాట్ డ్రెస్‌లో రెచ్చిపోయిన లైగర్ పాప: ఆమెను ఇలా చూస్తే అస్సలు ఆగలేరు!

2వ రోజుల్లో ఎంత వసూలైంది?
రెండు రోజుల్లో '18 పేజెస్' మూవీ తెలుగు రాష్ట్రాల్లో బాగానే రాణించింది. ఫలితంగా నైజాంలో రూ. 1.25 కోట్లు, సీడెడ్‌లో రూ. 23 లక్షలు, ఉత్తరాంధ్రాలో రూ. 27 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 18 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 10 లక్షలు, గుంటూరులో రూ. 11 లక్షలు, కృష్ణాలో రూ. 8 లక్షలు, నెల్లూరులో రూ. 6 లక్షలతో మొత్తంగా రూ. 2.28 కోట్లు షేర్, రూ. 4.45 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా
నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ నటించిన '18 పేజెస్' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 2 రోజుల్లో రూ. 2.28 కోట్లు వసూలు అయ్యాయి. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 25 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 48 లక్షలు వచ్చాయి. వీటితో కలుపుకుంటే రెండు రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.01 కోట్లు షేర్‌తో పాటు రూ. 6.05 కోట్లు గ్రాస్ వసూలైంది.
బెడ్‌రూంలో లవర్‌తో శృతి హాసన్ రచ్చ: నాకు అదే కావాలి అంటూ దొరికిపోయిందిగా!

టార్గెట్ చేరాలంటే ఎంత రావాలి
టాలెంటెడ్ స్టార్ నిఖిల్ హీరోగా నటించిన '18 పేజెస్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 12.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 12.50 కోట్లుగా నమోదైంది. ఇక, 2 రోజుల్లో దీనికి రూ. 3.01 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 9.49 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.

నిర్మాతలకు మాత్రం లాభాలే
హీరో
నిఖిల్
-
పల్నాటి
సూర్య
ప్రతాప్
కాంబినేషన్‌లో
రూపొందిన
'18
పేజెస్'
మూవీకి
నాన్
థియేట్రికల్
రైట్స్
ద్వారానే
పెట్టుబడులు
వచ్చేశాయి.
దీనికితోడు
ఈ
చిత్రాన్ని
గీతా
ఆర్ట్స్
సంస్థ
సొంతంగా
విడుదల
చేసుకుంది.
దీంతో
మొదటి
రోజు
నుంచే
ఈ
మూవీ
లాభాలను
అందిస్తోంది.
ఇలా
ఇప్పటి
వరకూ
వచ్చిన
కలెక్షన్లు
అన్నీ
ఈ
మూవీకి
ప్రాఫిట్స్‌నే
అందించాయి.