Don't Miss!
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- News
Wife: నువ్వు ఎంజాయ్ చెయ్యడానికి నా భార్య కావాలా ?, నువ్వు అంత మగాడివా రా ?, ఇద్దరూ క్రిమినల్స్!
- Finance
Holidays in February: ఫిబ్రవరిలో 10 రోజులు బ్యాంక్స్ క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..?
- Sports
INDvsNZ : ఓపెనింగ్.. ఫినిషింగ్.. రెండూ టీమిండియాకు సమస్యలే!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
18 Pages 3 Days Collections: మొదటి రోజు కంటే మూడవ రోజే ఎక్కువ కలెక్షన్స్.. బాక్సాఫీస్ వద్ద నిఖిల్ హవా!
టాలీవుడ్ యువ హీరో నిఖిల్ ఇటీవల కాలంలో వరుస హిట్స్ తో తన మార్కెట్ రేంజ్ ను మరో లెవెల్ కు పెంచుకుంటున్నాడు. నిఖిల్ సిద్దార్థ్ ఇటీవల నటించిన కార్తికేయ 3 కూడా ఊహించని స్థాయిలో కలెక్షన్స్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో 100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది. ఇక '18 పేజెస్' అనే సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిఖిల్ మంచి టాక్ సొంతం చేసుకున్నాడు. ఇక 18 పేజెస్ 3 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది అనే వివరాల్లోకి వెళితే..

బిజినెస్ ఎంత?
నిఖిల్ సిద్ధార్థ్ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన 18 పేజెస్ సినిమాకు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించగా సుకుమార్ కథ కథనాలు అందించారు. జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాను బన్నీ వాస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక ఈ సినిమా బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి.
నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 5 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఏపీ తెలంగాణలో రూ. 10.00 కోట్ల బిజినెస్ చేయగా.. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.50 కోట్లతో కలిపి ఓవరాల్‌గా వరల్డ్ వైడ్ రూ. 12.00 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసింది.

ముందే లాభాలు
అసలైతే 18 పేజెస్ సినిమాకు విడుదలకు ముందే నాన్ థియేట్రికల్ గా మంచి బిజినెస్ జరిగింది. ఆ రూట్లో సినిమా దాదాపు 6 కోట్ల వరకు టేబుల్ ప్రాఫిట్ అందించింది. ఇంతకుముందు నిఖిల్ నటించిన సినిమాలు వరుసగా సక్సెస్ కావడంతో మిగతా భాషల్లో డబ్బింగ్ హక్కులు కూడా మంచి రేటుకు అమ్ముడయ్యాయి.

3వ రోజు నైజాం, ఏపీ కలెక్షన్స్
ఇక '18 పేజెస్' సినిమా ఏపీ నైజాంలో 3వ రోజు ఎంత కలెక్షన్స్ అందుకుంది అంటే.. నైజాంలో రూ. 78 లక్షలు, సీడెడ్‌లో రూ. 17 లక్షలు, ఉత్తరాంధ్రాలో రూ. 18 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 10 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, గుంటూరులో రూ. 6 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో మొత్తంగా రూ. 1.45 కోట్లు షేర్, రూ. 2.70 కోట్లు గ్రాస్ వచ్చింది.

3 రోజుల్లో ఎంత వచ్చాయంటే..
మూడు రోజుల్లో '18 పేజెస్' సినిమాకు వచ్చిన కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో రూ. 2.03 కోట్లు, సీడెడ్‌లో రూ. 40 లక్షలు, ఉత్తరాంధ్రాలో రూ. 45 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 28 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 15 లక్షలు, గుంటూరులో రూ. 18 లక్షలు, కృష్ణాలో రూ. 14 లక్షలు, నెల్లూరులో రూ. 10 లక్షలతో మొత్తంగా రూ. 3.73 కోట్లు షేర్, రూ. 9.50 కోట్లు గ్రాస్ వసూలైంది.

మొదటి రోజు కంటే ఎక్కువ
నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన '18 పేజెస్' సినిమా ఆంధ్రా, తెలంగాణలో మొదటి రెండు రోజుల్లో కంటే మూడవ రోజు ఎక్కువ స్థాయిలో కలెక్షన్స్ అందుకోవడం విశేషం. మొదటి రోజు 1.22 కోట్ల షేర్ వచ్చింది. ఇక రెండవ రోజు కాస్త తక్కువగా 1.06 కోట్లు వచ్చాయి. కానీ మూడవ రోజు మాత్రం అంతకంటే ఎక్కువగా 1.45 కోట్లు రావడం విశేషం.

వరల్డ్ వైడ్ కలెక్షన్స్
ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 18 పేజెస్ 3 రోజుల్లో రోజుల్లో తెలుగు స్టేట్స్ లో రూ. 3.73 కోట్లు వసూలు చేసింది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 40 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 65 లక్షలు వచ్చాయి. ఇక మొత్తంగా కలుపుకుంటే మూడు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.78 కోట్లు షేర్, రూ. 9.50 కోట్లు గ్రాస్ దక్కింది.

ఇంకా ఎంత రావాలంటే..
'18 పేజెస్' సినిమాకు హాలిడేస్ బాగానే కలిసొచ్చింది. పోటీగా అవతార్ ధమాకా కూడా మంచి కలెక్షన్స్ అందుకుంటున్నాయి. ఇక రూ. 12.00 కోట్లు మేర బిజినెస్ చేసిన 18 పేజెస్ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 12.50 కోట్లకు ఫిక్స్ అయ్యింది. ఇక 3 రోజుల్లో ఈ సినిమా రూ. 4.78 కోట్లు వచ్చాయి.. అంటే హిట్ కావాలి అంటే మరో రూ. 7.72 కోట్లు అందుకోవాల్సి ఉంటుంది. మరి బాక్సాఫీస్ వద్ద సోమవారం నుంచి ఎలాంటి కలెక్షన్స్ వస్తాయో చూడాలి.