For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  18 Pages Collections: 5వ రోజు ఊహించని వసూళ్లు.. అప్పుడే అన్ని కోట్లు.. లాభమెంతో తెలిస్తే షాకే

  |

  విలక్షణమైన నటన, విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని సత్తా చాటుతోన్నాడు యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్. కెరీర్ ఆరంభం నుంచీ వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తోన్న అతడు.. ఇటీవలి కాలంలో ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్నాడు. ఈ ఉత్సాహంతోనే సినిమాల మీద సినిమాలు చేస్తోన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే '18 పేజెస్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి మంచి స్పందన దక్కుతోంది. ఫలితంగా వసూళ్లు బాగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 18 పేజెస్ 5 రోజుల రిపోర్టుపై ఓ లుక్కేద్దాం పదండి!

  18 పేజెస్ అంటూ నిఖిల్ ఎంట్రీ

  18 పేజెస్ అంటూ నిఖిల్ ఎంట్రీ

  నిఖిల్ సిద్ధార్థ్ - పల్నాటి సూర్య ప్రతాప్ కాంబోలో రూపొందిన చిత్రమే '18 పేజెస్'. ఈ మూవీని జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా చేసింది. ఇక, ఈ మూవీలో దినేష్ రాజ్, అజయ్, పోసాని, బ్రహ్మాజీలు కీలక పాత్రలు పోషించారు. దీనికి గోపీ సుందర్ సంగీతాన్ని అందించాడు.

  గృహలక్ష్మి లాస్య ఓవర్ డోస్ హాట్ షో: ఎద అందాలు చూపిస్తూ ఘోరంగా!

   నిఖిల్ మూవీకి ముందే లాభాలు

  నిఖిల్ మూవీకి ముందే లాభాలు

  నిఖిల్ నటించిన '18 పేజెస్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు నెలకొన్నాయి. దీంతో నాన్ థియేట్రికల్‌ రైట్స్‌కు మంచి బిజినెస్ జరిగింది. ముఖ్యంగా 'కార్తికేయ 2' మూవీ ప్రభావంతో ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయాయి. ఫలితంగా అలా ఈ మూవీ దాదాపు రూ. 6 కోట్ల వరకు టేబుల్ ప్రాఫిట్ వచ్చి నిర్మాతలు సేఫ్ అయినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

  5వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది

  5వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది

  '18 పేజెస్' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఐదో రోజు మంచి వసూళ్లే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 35 లక్షలు, సీడెడ్‌లో రూ. 7 లక్షలు, ఉత్తరాంధ్రాలో రూ. 8 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో మొత్తంగా రూ. 66 లక్షలు షేర్, రూ. 1.25 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

  Bigg Boss 7: బిగ్ బాస్‌కు బాలయ్య షాకింగ్ కండీషన్స్.. నాగార్జునకు మరో దెబ్బ.. ఇండస్ట్రీలో కలకలం

  5వ రోజుల్లో ఎంత వసూలైంది?

  5వ రోజుల్లో ఎంత వసూలైంది?

  5 రోజుల్లో '18 పేజెస్' మూవీ తెలుగు రాష్ట్రాల్లో బాగానే రాణించింది. ఫలితంగా నైజాంలో రూ. 2.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 55 లక్షలు, ఉత్తరాంధ్రాలో రూ. 63 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 39 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 21 లక్షలు, గుంటూరులో రూ. 26 లక్షలు, కృష్ణాలో రూ. 20 లక్షలు, నెల్లూరులో రూ. 13 లక్షలతో మొత్తంగా రూ. 5.17 కోట్లు షేర్, రూ. 9.85 కోట్లు గ్రాస్ వసూలైంది.

  ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

  ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

  నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన '18 పేజెస్' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 5 రోజుల్లో రూ. 5.17 కోట్లు వచ్చాయి. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 54 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 80 లక్షలు వచ్చాయి. వీటితో కలుపుకుంటే 5 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 6.51 కోట్లు షేర్‌తో పాటు రూ. 12.85 కోట్లు గ్రాస్ వసూలైంది.

  యాంకర్ రష్మీ గుట్టురట్టు చేసిన కమెడియన్: ఆ పని చేసి డబ్బు సంపాదిస్తుందంటూ షాకింగ్‌గా!

  ఓన్ రిలీజ్.. అన్ని కోట్ల లాభాలు

  ఓన్ రిలీజ్.. అన్ని కోట్ల లాభాలు

  హీరో నిఖిల్ - పల్నాటి సూర్య ప్రతాప్ కాంబినేషన్‌లో రూపొందిన '18 పేజెస్' మూవీకి నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే పెట్టుబడులు వచ్చేశాయి. దీనికితోడు ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ సొంతంగా విడుదల చేసుకుంది. దీంతో మొదటి రోజు నుంచే ఈ మూవీ లాభాలను అందిస్తోంది. ఇలా ఇప్పటి వరకూ వచ్చిన కలెక్షన్లు అన్నీ ఈ మూవీకి ప్రాఫిట్స్‌నే అందించాయని చెప్పొచ్చు.

  English summary
  Nikhil Siddhartha Did 18 Pages Movie Under Palnati Surya Pratap Directions. This Movie Collect 6.51 CR in 5 Days.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X