18 Pages Collections: నిఖిల్ మూవీకి షాకింగ్ కలెక్షన్స్.. 6వ రోజూ అలా.. టోటల్‌గా లాభం ఎంతో తెలిస్తే!

టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుని స్టార్‌డమ్‌ను అందుకునే దిశగా అడుగులు వేస్తోన్నాడు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్. సినిమా సినిమాకూ వైవిధ్యాన్ని చూపిస్తోన్న అతడు.. మంచి ఫలితాలను రాబడుతూ తన రేంజ్‌ను క్రమంగా పెంచుకుంటోన్నాడు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా హిట్ కొట్టాడు. ఇక, ఇప్పుడు నిఖిల్ '18 పేజెస్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి మంచి స్పందన దక్కుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ 6 రోజుల రిపోర్టును చూడండి!

18 పేజెస్‌తో మరొక ప్రయోగం

18 పేజెస్‌తో మరొక ప్రయోగం

నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కించిన సినిమానే '18 పేజెస్'. ఈ మూవీని జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా చేసింది. ఇక, ఈ మూవీలో దినేష్ రాజ్, అజయ్, పోసాని, బ్రహ్మాజీలు కీలక పాత్రలు పోషించారు. దీనికి గోపీ సుందర్ మ్యూజిక్ ఇచ్చాడు.

నిఖిల్ మూవీకి ముందే లాభాలు

నిఖిల్ మూవీకి ముందే లాభాలు

నిఖిల్ హీరోగా చేసిన '18 పేజెస్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలున్నాయి. దీంతో నాన్ థియేట్రికల్‌ రైట్స్‌కు మంచి బిజినెస్ జరిగింది. ముఖ్యంగా 'కార్తికేయ 2' మూవీ ప్రభావంతో ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయాయి. ఫలితంగా అలా ఈ మూవీ దాదాపు రూ. 6 కోట్ల వరకు టేబుల్ ప్రాఫిట్ వచ్చి నిర్మాతలు సేఫ్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

6వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది

6వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది

'18 పేజెస్' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 6వ రోజు మంచి వసూళ్లే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 31 లక్షలు, సీడెడ్‌లో రూ. 6 లక్షలు, ఉత్తరాంధ్రాలో రూ. 7 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో మొత్తంగా రూ. 57 లక్షలు షేర్, రూ. 1.10 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

6వ రోజుల్లో ఎంత వసూలైంది?

6వ రోజుల్లో ఎంత వసూలైంది?

'18 పేజెస్' మూవీ 6 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో బాగానే రాణించింది. ఫలితంగా నైజాంలో రూ. 3.11 కోట్లు, సీడెడ్‌లో రూ. 61 లక్షలు, ఉత్తరాంధ్రాలో రూ. 70 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 43 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 23 లక్షలు, గుంటూరులో రూ. 29 లక్షలు, కృష్ణాలో రూ. 23 లక్షలు, నెల్లూరులో రూ. 14 లక్షలతో మొత్తంగా రూ. 5.74 కోట్లు షేర్, రూ. 10.95 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

నిఖిల్ సిద్దార్థ్ - అనుపమ జోడీగా నటించిన '18 పేజెస్' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 6 రోజుల్లో రూ. 5.74 కోట్లు వసూలు అయ్యాయి. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 60 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.15 కోట్లు వచ్చాయి. వీటితో కలుపుకుంటే 6 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.49 కోట్లు షేర్‌తో పాటు రూ. 14.80 కోట్లు గ్రాస్ వసూలైంది.

సొంతంగా రిలీజ్ చేయడంతో

సొంతంగా రిలీజ్ చేయడంతో

నిఖిల్ హీరోగా పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కించిన '18 పేజెస్' మూవీకి నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే పెట్టుబడులు వచ్చేశాయి. దీనికితోడు ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ సొంతంగా విడుదల చేసుకుంది. దీంతో మొదటి రోజు నుంచే ఈ మూవీకి లాభాలు దక్కుతున్నాయి. ఇలా ఇప్పటి వరకూ వచ్చిన కలెక్షన్లు అన్నీ నిర్మాతలకు ప్రాఫిట్స్‌నే అందించాయని చెప్పొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X