Don't Miss!
- Sports
ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది: హార్దిక్ పాండ్యా
- News
Girl: సోషల్ మీడియా బాయ్ ఫ్రెండ్ కోసం వెళ్లి ?, ఎంత అందంగా ఉంటే ఏం లాభం !
- Finance
adani lic: భారీ నష్టాల్లో LIC.. కారణమేంటో తెలుసా..?
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్‌ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
18 Pages: అన్ని వందల థియేటర్లలో 18 పేజెస్.. నిఖిల్ సినిమా సరికొత్త రికార్డు
బ్యాగ్రౌండ్ లేకుండానే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. మినిమమ్ గ్యారెంటీ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్. మూవీ మూవీకీ వైవిధ్యాన్ని చూపిస్తూ ప్రేక్షకుల మనసులు దోచుకుంటోన్న ఈ యంగ్ హీరో.. మధ్యలో కొన్ని పరాజయాలతో సతమతం అయ్యాడు. కానీ, మళ్లీ ఇప్పుడు వరుస హిట్లతో సత్తా చాటుతోన్నాడు. ముఖ్యంగా 'కార్తికేయ 2' మూవీతో నిఖిల్ పాన్ ఇండియా రేంజ్‌లో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తూ వెళ్తోన్నాడు.
బీచ్‌లో యాంకర్ హరితేజ హాట్ షో: అలాంటి డ్రెస్‌లో తొలిసారి అరాచకంగా!
నిఖిల్ సిద్దార్థ్ '18 పేజెస్' అనే విభిన్నమైన సినిమాలో నటించాడు. 'కుమారి 21 F' ఫేం పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కించిన ఈ మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. ఇప్పటికే దీని నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు అన్నీ ప్రేక్షకుల మన్ననలు పొందాయి. దీంతో ఈ చిత్రం డిసెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా దాదాపుగా పూర్తి చేసుకుంది. ఇక, నేటి రాత్రి నుంచి ఓవర్సీస్‌లో '18 పేజెస్' మూవీ ప్రీమియర్స్‌ను వేయబోతున్నారు.

'18 పేజెస్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని బిజినెస్ భారీ మొత్తంలో జరిగింది. ఇక, తాజా సమాచారం ప్రకారం ఈ మూవీని నైజాంలో 135, సీడెడ్‌లో 65, ఆంధ్రాలో 185 వరకూ అంటే మొత్తంగా రెండు రాష్ట్రాల్లో కలిపి 385 నుంచి 400 థియేటర్లలో విడుదల అవుతోంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో 60, ఓవర్సీస్‌లో 400 థియేటర్లలో రాబోతుంది. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 845 నుంచి 850 థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఇది నిఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ రిలీజ్ అని తెలుస్తోంది. దీంతో అతడు విడుదలకు ముందే రికార్డు నమోదు చేసుకున్నాడు.
సారా అలీ ఖాన్ హాట్ వీడియో వైరల్: రెడ్ బికినీలో ఎద అందాల ప్రదర్శన
నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కించిన '18 పేజెస్' మూవీని జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. దీనికి గోపీ సుందర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇక, ఈ మూవీలో దినేష్ రాజ్, అజయ్, పోసాని కృష్ణ మురళి, బ్రహ్మాజీ తదితరులు నటించారు.