»   » కిడ్నాప్ లు..కామెడీ ('శంకరాభరణం' ప్రివ్యూ)

కిడ్నాప్ లు..కామెడీ ('శంకరాభరణం' ప్రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: మరో హిందీ చిత్రం రీమేక్ , తెలుగు నేటివిటీ అద్దుకుని ఈ రోజు విడుదలకు సిద్దమవుతోంది. ఆ చిత్రంమే శంకరాభరణం. హిందీలో వచ్చిన 'ఫస్‌ గయారే ఒబామా' అనే చిత్రం రైట్స్ తీసుకుని, మన తెలుగు కామెడీ అద్ది రూపొందిన ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. క్రైమ్ కామెడీతో ఈ చిత్రం కొత్త ట్రైండ్ క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు.

హీరో నిఖిల్ ఎన్.ఆర్.ఐ. ఈ ప్రపంచంలో సుఖపడేవాళ్లు, కష్టపడేవాళ్లు..ఈ రెండు జాతులే ఉంటాయన్నది అతని సిద్ధాంతం. తాను సుఖపడటానికే పుట్టానని నమ్ముతుంటాడు. తనకు సంబందిచిన భూమిని విడిపించుకోవాలని ఇండియాకు వస్తాడు. అతడు అనుకోని కష్టాల్లో చిక్కుకుంటాడు. వాటి నుంచి అతను ఎలా తప్పించుకున్నాడు, ఎలా విడిపించుకున్నడన్నదే చిత్ర ఇతివృత్తం.

Sankarabharanam

కోన వెంకట్ మాట్లాడుతూ... 'ఫస్‌ గయారే ఒబామా' కథకి, మా 'శంకరాభరణం' కథకీ మధ్య పోలికలు లేవు. అందులోని కామెడీని ప్రేరణగా తీసుకుని కొత్తగా సన్నివేశాల్ని సృష్టించాం. పదిహేనేళ్ల కిందటే ఈ కథ పురుడు పోసుకుంది. అప్పుడోసారి నేను బీహార్‌ వెళ్లా. అక్కడ ఎస్‌.పిగా నా మిత్రుడు శర్మరాజ్‌ పనిచేస్తున్నారు. అక్కడ జరిగే కిడ్నాప్‌ ఉదంతాల గురించి తెలుసుకొన్న తర్వాత ఆశ్చర్యం కలిగింది. అప్పుడే ఆ నేపథ్యంలో ఓ సినిమా తీస్తే బాగుంటుందనుకొన్నా. అది ఇప్పుడు కుదిరింది.

అమెరికా నుంచి ఇండియాకి వచ్చిన కోటీశ్వరుడి కొడుకు బీహార్‌కి వెళ్లినప్పుడు అతనికి ఎదురైన కిడ్నాప్‌ అనుభవాల నేపథ్యంలోనే 'శంకరాభరణం' కథ సాగుతుంది. ఇక సినిమా పేరు విషయానికొస్తే... ముందే కె.విశ్వనాథ్‌గారి దగ్గరికి వెళ్లి కథని చెప్పా. మీ సినిమా పేరే పెట్టాలనుకుంటున్నట్టు చెప్పా. నాపై నమ్మకంతో ఆయన నవ్వేశారు. పాటల వేడుకకీ వచ్చి ఆశీర్వదించారు. ఇలాంటి సినిమాలకి పేరు చాలా కీలకం. ప్రేక్షకుల్ని ఆకర్షించేలా పేరు ఉండాలి. అందుకే 'శంకరాభరణం'ని నిర్ణయించాం అన్నారు.

నటీనటులు: నిఖిల్‌, నందిత, రావు రమేష్, అంజలి, సుమన్‌, సితార, రావు రమేష్‌, సప్తగిరి, సత్యం రాజేష్, షకలక శంకర్, సుజయ్ మిశ్రా తదితరులు
కెమెరా: సాయిశ్రీరామ్,
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు,
రచనాసహకారం: వెంకటేశ్ కిలారు, భవానీ ప్రసాద్,
డ్యాన్స్ మాస్టర్స్: శేఖర్-శివ,
ఫైట్ మాస్టర్: విజయ్,
మేనేజర్స్: నాగు-రవి,
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రామన్ చౌదరి,
సహనిర్మాతలు: వి.ఎస్.ఎన్. కుమార్ చీమల, జి. వెంకటేశ్వరావ్,
కథ-స్క్రీన్‌ప్లే-మాటలు: కోన వెంకట్.
దర్శకత్వం :ఉదయ్ నందనవనం
విడుదల తేదీ :04-12-2015


English summary
Nikhil Siddharth looks to continue his string of smash successes with ‘Sankarabharanam’, a thrilling action comedy which marks the directorial debut of Uday Nandanavanam.
Please Wait while comments are loading...