»   » స్టార్ స్టేటస్ మీద దెబ్బకొట్టాడు: నాని నిన్నుకోరి ఫైనల్ కలెక్షన్ ఇదీ, నాని సత్తా ఇదీ

స్టార్ స్టేటస్ మీద దెబ్బకొట్టాడు: నాని నిన్నుకోరి ఫైనల్ కలెక్షన్ ఇదీ, నాని సత్తా ఇదీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాచురల్ స్టార్ నాని నటించిన నిన్నుకోరి రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ఇయర్ ఇప్పటికే నేను లోకల్ తో హిట్ అందుకున్న నాని నిన్నుకోరితో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో నాని, నివేదా థామస్, ఆది పినిశెట్టిల అద్భుత నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ మూవీ విడుదలైన అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ కలక్షన్స్ తో దుమ్మురేపింది.

ఒన్ మిలియన్ డాలర్ల క్లబ్

ఒన్ మిలియన్ డాలర్ల క్లబ్

ఇదివరకు ఈగ, భలే భలేమగాడివోయ్, నేనులోకల్ ఒన్ మిలియన్ డాలర్ల క్లబ్ లో ఉన్నాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి నిన్నుకోరి చేరింది. మొదట బిసి సెంటర్లలో అంతగా ఆకట్టుకోకపోవచ్చునని చిత్ర హీరో నానియే అన్నాడు. కానీ ఆ సెంటర్లలోనే నిన్ను కోరి భారీ కలెక్షన్స్ ను రాబట్టింది.


Nani Ninnu Kori Movie Review
బాగానే లాభపడ్డారు

బాగానే లాభపడ్డారు

అంతే కాకుండా సీడెడ్, గుంటూరు వంటి ఏరియాల్లో నాని కాస్త మార్కెట్ ను పెంచుకున్నాడనే చెప్పాలి.నాని వల్ల ఇటు నిర్మాత, అటు బయ్యర్లు బాగానే లాభపడ్డారు. దీంతో నాని సినిమాకోసం బడా బడా నిర్మాతలు క్యూ కడుతున్నారట. అయితే ప్రస్తుతం నాని దిల్ రాజు ప్రొడక్షన్ లో ఒక సినిమాతో మరియు మేకపార్ల గాంధీ సినిమాలతో బిజీగా ఉన్నాడు.


నేను లోకల్

నేను లోకల్

ఇప్పటికే ఈ ఇయర్ నేను లోకల్ తో హిట్ అందుకున్న నాని నిన్నుకోరితో కూడా సూపర్ హిట్ అందుకున్నాడు. మొదటి రోజు మొదటి టాక్ నుండి పాజిటివ్ బజ్ తో నాని సత్తాని మరోసారి తెలియచేసింది నిన్ను కోరి సినిమా. ఇక ఈ సినిమా కలక్షన్స్ కూడా అదే రేంజ్ లో ఉన్నాయి.


ఏపి అండ్ తెలంగాణా కలక్షన్స్

ఏపి అండ్ తెలంగాణా కలక్షన్స్

కమర్షియల్ గా సక్సెస్ అవుతూ వస్తున్న నాని సినిమాల్లో నిన్ను కోరి కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్స్ లిస్ట్ లో చేరింది. నైజాం 9.63 కోట్లు, సీడెడ్ 2.79 కోట్లు, వైజాగ్ 3.24 కోట్లు, గుంటూర్ 1.46 కోట్లు, ఈస్ట్ 1.78 కోట్లు, వెస్ట్ 1.18 కోట్లు, కృష్ణా 1.55 కోట్లు, నెల్లూరు 0.63 లక్షలు, టోటల్ ఏపి అండ్ తెలంగాణా కలక్షన్స్ : 22.26 కోట్లు కాగా.. రెస్ట్ ఆఫ్ ఇండియా 2.35 కోట్లు, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ 4.25 కోట్లు వసూలు చేసింది. ఇక మొత్తం ప్రపంచ వ్యాప్తంగా నిన్ను కోరి 28.86 కోట్ల కలక్షన్స్ తో బిజినెస్ క్లోజ్ అయ్యింది.


English summary
Tollywood Natural Star Latest Movie Ninnu Kori Total Collections.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu