Check 6 days collections: నితిన్ నుంచి ఇలాంటి కలెక్షన్స్ ఊహించలేదు.. షాకింగ్!
కమర్షియల్ సినిమాలతో నితిన్ చాలా సార్లు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాడు. కొన్ని సందర్భాల్లో ప్రయోగాలతో కూడా సక్సెస్ అయ్యాడు. అయితే చాలా కాలం తరువాత రెగ్యులర్ కాన్సెప్ట్స్ ను పక్కన పెట్టి ప్రయత్నం చేసిందే చెక్. ఈ సినిమాకు సోషల్ మీడియాలో బజ్ బాగానే క్రియేట్ అయ్యింది. ఇక బాక్సాఫీస్ వద్ద మాత్రం అనుకున్నంత రేంజ్ లో క్లిక్కవ్వలేదు. ఇక చెక్ 6వ రోజు కూడా మరో షాక్ ఇచ్చింది. ఆ కలెక్షన్స్ పై ఒక లుక్కేస్తే..

పెట్టిన పెట్టుబడిలో ఇప్పటివరకు..
వినూత్నమైన సినిమాలను తెరకెక్కించే దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఈసారి తప్పకుండా బాక్సాఫీస్ వద్ద ఎదో సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉన్నాడని టాక్ గట్టిగానే వచ్చింది. ట్రైలర్ తోనే ఓ వర్గం ఆడియెన్స్ లో అంచనాలును పెంచిన సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్సీడ్ టాక్ తో వెలుతోంది. అయితే సినిమా పెట్టిన పెట్టుబడిలో ఇప్పటివరకు సగమే వసూలు చేసింది. లాభాల్లోకి రావాలంటే మరో సగం రావాల్సిందే.

తగ్గుతూనే ఉన్నాయి
మిక్సీడ్ టాక్ తో వెళుతున్న ఈ సినిమా మొదటి రోజు నుంచి కూడా కలెక్షన్స్ అనుకున్నంత రేంజ్ లో ఏమి రాలేవు. మొదటి రోజు 3.38కోట్ల షేర్స్ మాత్రమే అందుకున్న చెక్ ఆ మరుసటి రోజు నుంచి రెండు కోట్ల షేర్స్ ను కూడా అందుకోలేకపోయింది. అప్పటి నుంచి 6వ రోజు వరకు కూడా తగ్గుతూనే వస్తున్నాయి.
Recommended Video

6వ రోజు వచ్చిన కలెక్షన్స్
తెలుగు రాష్ట్రాల్లో 6వ రోజు కూడా సినిమా కలెక్షన్స్ చాలా తగ్గిపోయాయి. నైజాం 5లక్షలు, సీడెడ్ 2లక్షలు, ఉత్తరాంధ్ర 4లక్షలు, ఈస్ట్ 2.1లక్షలు, వెస్ట్ 1.2లక్షలు, గుంటూరు 2లక్షలు, కృష్ణా 2లక్షలు, నెల్లూరు 1లక్షలు. ఏపీ తెలంగాణలో 6వ రోజు చెక్ సినిమాకు వచ్చిన మొత్తం షేర్స్ 0.19కోట్లు. గ్రాస్ 0.35కోట్లు

ప్రాఫిట్స్ లోకి రావాలి అంటే..
6 రోజుల్లో సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 7.92కోట్ల షేర్స్ మాత్రమే అందుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా వచ్చిన షేర్స్ 8.87కోట్లు. ఈ సినిమా బాక్సాఫీస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 16.5 కోట్లు. ప్రాఫిట్స్ లోకి వస్తుందో రాదో తెలియదు గాని నష్టాలు రాకుండా ఉండాలి అంటే కనీసం 7కోట్లయినా రాబట్టాలి. అయితే డే బై డే మాత్రం కలెక్షన్స్ భారీగా తగ్గుతున్నాయి. మరోవైపు కొత్త సినిమాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరి నితిన్ చెక్ మిగిలిన రోజుల్లో ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











