For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌' కలెక్షన్స్ పరిస్ధితి ఏంటి?

  By Srikanya
  |

  హైదరాబాద్: నితిన్‌ హీరోగా నటించిన చిత్రం 'కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌' చిత్రం మొన్న వినాయిక చవితి సందర్బంగా రిలీజైంది. మొదటి రోజు డీసెంట్ ఫిగర్స్ నమోదు చేసినా తర్వాత పూర్తిగా డ్రాప్ అవటం మొదలైంది. రివ్యూలు పూర్తి నెగిటివ్ గా రావటంతో ఇలా జరిగిందని భావిస్తున్నారు. రెండో రోజుకే డ్రాప్ స్టార్టవటంతో ట్రేడ్ లో ఈ విషయం టాపిక్ గా మారింది. శని,ఆదివారాలలో కూడా పికప్ కాలేదు. ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కేవలం నాలుగు కోట్లు షేర్ మాత్రమే కలెక్ట్ చేసిందని సమాచారం. నితిన్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఇదే పెద్ద ఫ్లాఫ్. మిగతావన్ని హిట్, సూపర్ హిట్, యావరేజ్ గా నమోదు అయ్యాయి.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  యామీ గౌతమ్‌ హీరోయిన్. ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ ఈ చిత్రానికి సమర్పకుడు. ప్రేమ్‌సాయి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గురు ఫిలింస్‌, మల్టీడైమెన్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మించాయి. కార్తీక్‌, అనూప్‌ సంగీతం అందించారు.

  Nithiin`s Courier Boy Kalyan Bombs at the Box Office

  నితిన్‌ మాట్లాడుతూ ''ఈ సినిమా కోసం గౌతమ్‌ మేనన్‌, ప్రేమ్‌సాయి చాలా కష్టపడ్డారు. నా దృష్టిలో ఈ సినిమాకి వాళ్లే హీరోలు. సన్నివేశాలు సహజంగా ఉంటాయి. భారతీయ వెండి తెరపై ఇలాంటి కథాంశంతో ఎవ్వరూ సినిమా తీయలేదు. కొత్తదనం కోరుకొనే ప్రేక్షకులకు ఈ చిత్రం బాగా నచ్చుతుంది''అన్నారు.

  గౌతమ్‌ మేనన్‌ చెబుతూ ''తెలుగులో నేను నిర్మించిన తొలి చిత్రమిది. కథ నచ్చే ప్రేమ్‌సాయికి అవకాశం ఇచ్చాను. అందరూ తమ వంతు సహకారం అందించారు''అన్నారు.

  దర్శకుడు మాట్లాడుతూ ''ఓ కొరియర్‌ బోయ్‌ కథ ఇది. ఓ కొరియర్‌ వల్ల ఎలాంటి సమస్యల్లో చిక్కుకొన్నాడు, అందులోంచి ఎలా బయటపడ్డాడు అనేదే ఈ సినిమా. వినోదం, యాక్షన్‌, థ్రిల్‌ కలగలిపిన ప్రేమకథ ఇది. కార్తీక్‌, అనూప్‌ రూబెన్స్‌ అందించిన సంగీతం ఆకట్టుకొంటుంది. తెలుగు, తమిళ భాషల్లో చిత్రాన్ని ఒకేసారి విడుదల చేస్తున్నాము''అన్నారు.

  Nithiin`s Courier Boy Kalyan Bombs at the Box Office

  గౌతమ్ మీనన్ మాట్లాడుతూ....''ఈ సినిమా ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి చాలా కారణాలున్నాయి. తెలుగులో షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. తమిళంలో జీవా కాల్షీట్లు కావల్సినన్ని దొరకలేదు. రెండు భాషల్లో సినిమాని ఒకేసారి విడుదల చేయాలనుకొన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు తప్పవు'' అని చెప్పుకొచ్చారు.

  అశుతోష్‌ రాణా, నాజర్‌, సత్యం రాజేష్‌, సప్తగిరి, రవి ప్రకాష్‌, యింటూరి వాసు తదితరులు నటించారు.

  English summary
  Nithiin`s `Courier Boy Kalyan`s hasn`t been able to manage even Decent Figures from 2nd day, not eve on Sunday and collected only around 4 Cr Share approx in 5 Days Worldwide.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X