»   » మూడేళ్లనాటి నితిన్ సినిమాకు మోక్షం...రిలీడ్ డేట్,కొత్త పోస్టర్

మూడేళ్లనాటి నితిన్ సినిమాకు మోక్షం...రిలీడ్ డేట్,కొత్త పోస్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: నితిన్ అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న చిత్రం 'కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌'. 2013లో మొదలైన ఈ చిత్రం ఎట్టకేలకు మోక్షం లభించినట్లైంది. ఈ చిత్రం కొత్త పోస్టర్‌ను, ఆడియో, రిలీజ్ డేట్ లను విడుదల చేశారు. ప్రేమ్‌సాయి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ పోస్టర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


చిత్రంలోని మాయా...ఓ మాయ సాంగ్ ప్రోమో ...ప్రముఖ నిర్మాత గౌతమ్ మీననన్ ఈ 'కొరియర్‌ బోయ్‌ కల్యాణ్‌'కు నిర్మాతగా మారారు. ఈ నెల 19న చిత్ర పాటలు విడుదలవుతున్నాయి. త్వరలో చిత్రం విడుదల తేదీని ఖరారు చేస్తామని నటుడు నితిన్‌ ప్రకటించారు. ఈ చిత్రంలో యామి గౌతమ్‌ హీరోయిన్ గా గా నటిస్తున్నారు. అయితే సెప్టెంబర్ 11 న చిత్రం విడుదల అయ్యే అవకాసం ఉందని సమాచారం.


Nithiin's Courier Boy Kalyan releases on Sept 11th

గౌతమ్ మీనన్ మాట్లాడుతూ....''ఈ సినిమా ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి చాలా కారణాలున్నాయి. తెలుగులో షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. తమిళంలో జీవా కాల్షీట్లు కావల్సినన్ని దొరకలేదు. రెండు భాషల్లో సినిమాని ఒకేసారి విడుదల చేయాలనుకొన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు తప్పవు'' అని చెప్పుకొచ్చారు.


Nithiin's Courier Boy Kalyan releases on Sept 11th

ఇంతకు ముందు విడుదల చేసిన ఈ చిత్రం ట్రైలర్ ని ఇక్కడ చూడవచ్చు....English summary
The long wait is finally over, Nithiin's CourierBoyKalyan releases on Sept 11th & audio launch on Aug 19th !!
Please Wait while comments are loading...