Don't Miss!
- News
union budget: మరికొద్ది గంటల్లో పార్లమెంటులో కేంద్ర బడ్జెట్, ఆశలు, అంచనాలు
- Finance
gst: రికార్డు స్థాయిలో GST వసూళ్లు.. ఇప్పటివరకు ఇదే రెండవ అత్యధికం
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Rang De 12 Days Collections: భారీగా పడిపోయిన రంగ్ దే కలెక్షన్లు.. ఆ రిజల్ట్ దిశగా నితిన్ చిత్రం
యూత్ స్టార్ నితిన్ - కీర్తీ సురేష్ జంటగా నటించిన చిత్రం 'రంగ్ దే'. టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరీ తెరకెక్కించిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రం గత నెలలో విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి ఆరంభం నుంచే పాజిటివ్ టాక్ రావడంతో పాటు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. దీంతో 'చెక్' వంటి భారీ డిజాస్టర్ తర్వాత నితిన్ ఖాతాలో హిట్ చేరబోతుందని అంతా అనుకున్నారు. కానీ మూడో రోజు నుంచే పతనం మొదలైంది.
మొదటి ఆట నుంచీ టాక్ మంచిగానే ఉన్నా 'రంగ్ దే' కలెక్షన్లు మాత్రం రోజు రోజుకూ తగ్గుతూనే వస్తున్నాయి. ఈ సోమవారం రూ. 9 లక్షలు వసూలు చేసిన ఈ చిత్రం మంగళవారం కేవలం రూ. 5 లక్షలు మాత్రమే రాబట్టింది. మొత్తంగా 12 రోజులకు గానూ తెలుగు రాష్ట్రాల్లో రూ. 13.87 కోట్లు షేర్‌తో పాటు రూ. 22.58 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. ఇక, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో ఇప్పటి వరకు రూ. 76 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.82 కోట్లు రాబట్టింది. అంటే 12 రోజులకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 16.46 కోట్లు షేర్, దాదాపు రూ. 29 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా 'రంగ్ దే' బిజినెస్ రూ. 23.90 కోట్లు జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 24.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ మూవీ 12 రోజులకు గానూ రూ. 16.46 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. అంటే.. మరో రూ. 8.04 కోట్లు వస్తేనే ఈ సినిమా హిట్ అయినట్లు లెక్క. అయితే, ప్రస్తుతం కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న కారణంగా చాలా మంది థియేటర్లకు రావడానికి జంకుతుడడంతో 'రంగ్ దే' కలెక్షన్లపై భారీగా ప్రభావం పడింది. దీంతో ఈ సినిమా కూడా నష్టాల దిశగానే సాగే ప్రమాదం ఉంది.