»   »  నితిన్ తెలుగు రైట్స్ తీసుకోవటమే టాక్ ఆఫ్ ది టౌన్

నితిన్ తెలుగు రైట్స్ తీసుకోవటమే టాక్ ఆఫ్ ది టౌన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తమిళ హీరో సూర్య, మనం దర్శకుడు విక్రమ్ కుమార్ కాంబినేషన్లో '24' టైటిల్ తో ఓ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. సమంత హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను తెలుగు వెర్షన్ హక్కులని యంగ్ హీరో నితిన్ సొంతం చేసుకున్నారు. శ్రేష్ట్ మూవీస్, గ్లోబల్ మూవీస్ ద్వారా నితిన్ '24' సినిమాను తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని నితిన్ ట్వీట్ ద్వారా తెలియచేసారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

సూర్య తన సొంత బ్యానర్ 2D ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్కడ మంచి బిజినెక్ క్రేజ్ వచ్చింది. అలాగే తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేసేందుకు చాలా పోటీ వచ్చింది. అయితే నితిన్ తనకు దర్శకుడుతో ఉన్న పరిచయంతో ఈ రైట్స్ ని సొంతం చేసుకున్నారు.

Nithin Got The Telugu Rights Of Suriya 24

ఇక '24' సినిమా ఓ సైన్స్ ఫిక్షన్‌ కథ అని తెలుస్తోంది. ఇన్నాళ్ళూ తమిళంలోనే హాట్ టాపిక్ గా నిలిచిన ఈ సినిమా, నితిన్ రైట్స్ తీసుకోవటంతో తెలుగులోనూ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ముంబై నేపథ్యంలో నడిచే ఈ సినిమాను డిసెంబర్ నెలలో విడుదల చేసేందుకు సూర్య సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులోనూ అదే రోజున విడుదల చేస్తారు.


ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో నిత్యామీనన్ నటిస్తోందని సమాచారం. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుగుతోంది. సూర్య సొంత బ్యానర్ 2D ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
English summary
Nithin got the telugu rights of Suriya and director Vikram Kumar’s Super Natural thriller 24.
Please Wait while comments are loading...