»   »  నితిన్‌కు ధాంక్స్ చెప్పిన డైరక్టర్ క్రిష్, సాయి కొర్రపాటి కు కూడా...

నితిన్‌కు ధాంక్స్ చెప్పిన డైరక్టర్ క్రిష్, సాయి కొర్రపాటి కు కూడా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: నందమూరి బాలకృష్ణ 100వ చిత్రంగా క్రిష్‌ దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రం నైజాం డిస్ట్రిబ్యూషన్‌ హక్కులను హీరో నితిన్‌ దక్కించుకున్నారు. ఈ విషయాన్ని నితిన్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలుపుతూ.. ఆనందం వ్యక్తం చేశారు.

దర్శకుడు క్రిష్‌కు, రాజీవ్‌కు ధన్యవాదాలు తెలిపారు. దీనికి క్రిష్‌ ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ.. 'ధన్యవాదాలు నితిన్‌, కలిసి సందడి చేద్దాం' అని ట్వీట్‌ చేశారు.

అలాగే క్రిష్...సాయి కొర్రపాటి సీడెడ్ రైట్స్ తీసుకున్నారని ట్వీట్ ద్వారా తెలియపరిచారు.

వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో శ్రియ, హేమమాలిని ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చిరంతన్‌భట్‌ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

nitin

ఇక ఇన్నాళ్లూ యూఎస్ లో బాలయ్య కనీసం అర మిలియన్ మార్క్ ను కూడా టచ్ చేయలేదు. కానీ గౌతమిపుత్ర శాతకర్ణి మూవీని మిలియన్ డాలర్ క్లబ్ లో చేర్చేలా ప్లానింగ్స్ జరుగుతున్నాయి. ఇందుకోసం.. బాలయ్య అమెరికా టూర్ లోనే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ టీజర్ ను విడుదల చేసారు. దర్శకుడు క్రిష్ కు ఓవర్సీస్ లో మంచి పేరు ఉంది. పైగా గౌతమిపుత్ర శాతకర్ణికి క్రిష్ తండ్రి అతని స్నేహితుడే నిర్మాతలు కావడంతో.. అన్ని ఏరియాల్లోనూ కలెక్షన్స్ కుమ్మేసేలా ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు.

English summary
Hero Nithin's father Sudhakar Reddy have bagged the rights of Nandamuri Balakrishna's prestigious 100th movie 'Gauthamiputra Satakarni' for Nizam area.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu