»   » నష్టమా..లాభమా? : ‘చిన్నదాన నీకోసం’టోటల్ కలెక్షన్స్ (ఏరియావైజ్)

నష్టమా..లాభమా? : ‘చిన్నదాన నీకోసం’టోటల్ కలెక్షన్స్ (ఏరియావైజ్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నితిన్ తాజా చిత్రం ‘చిన్నదాన నీకోసం' కొద్ది రోజుల క్రితం విడుదల అయ్యి...జస్ట్ ఓకే టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం 50 రోజులును హైదరాబాద్ శాంతి 70 ఎమ్.ఎమ్ థియోటర్ లోనూ, నిజమా బాద్ ...నటరాజ్ థియోటర్ లోనూ పూర్తి చేసుకుంది. బిజినెస్ 16 కోట్లు చేసుకున్న ఈ చిత్రం దాదాపు 15 కోట్లు మాత్రమే కలెక్షన్స్ సాధించి యావరేజ్ అనిపించుకుంది. వరుణ్ తేజ..ముకుందా కనుక రిలీజ్ కాకపోతే మరిన్ని కలెక్షన్స్ సాధించే అవకాసముందని ట్రేడ్ లో చెప్తున్నారు. అయితే ఏయే ఏరియాల్లో ఎంతెంత కలెక్టు చేసిందో ఒక్కసారి చూద్దాం.

 Nitin's Chinnadana Nee Kosam Total Collections

‘చిన్నదాన నీకోసం'టోటల్ కలెక్షన్స్:

నైజాం : Rs 6.5 కోట్లు

సీడెడ్ : Rs 2.01 కోట్లు

వైజాగ్ : Rs 1.55 కోట్లు

గుంటూరు: Rs 95 లక్షలు

కృష్ణా: Rs 70 లక్షలు

తూర్పు గోదావరి జిల్లా: Rs 63 లక్షలు

పశ్చిమ గోదావరి జిల్లా: Rs 53 లక్షలు

నెల్లూరు: Rs 33 లక్షలు

‘చిన్నదాన నీకోసం' ఎపి& నైజాంటోటల్ కలెక్షన్స్ (షేర్ ): Rs 13.20 కోట్లు

‘చిన్నదాన నీకోసం' ప్రపంచ వ్యాప్త కలెక్షన్స్ (షేర్) : Rs 14.95 కోట్లు ( కర్ణాటక: Rs 1.02 కోట్లు; మిగిలిన ఇండియా: Rs 23 లక్షలు; ఓవర్ సీస్: Rs 50 లక్షలు)

గమనిక : ఇవన్నీ కేవలం ట్రేడ్ లో చెప్పబడుతున్న లెక్కలు మాత్రమే

పన్నెండు వరస ఫ్లాపుల తర్వాత ఇష్క్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన నితిన్ తన వయస్సుకు తగ్గ లవ్ స్టోరీలు ఎంచుకుంటూ యాక్షన్ జోలికి వెళ్లకుండా సేఫ్ జోన్ లో కెరీర్ ని కొనసాగిస్తున్నారు. ఆయన ఇంతకు మునుపు చేసిన ‘ఇష్క్‌', ‘గుండెజారి గల్లంతయ్యిందే', ‘హార్ట్‌ ఎటాక్‌' మూడూ లవ్‌ స్టోరీలే. ఈ రోజు రిలీజ్ అవుతున్న ఈ కొత్త చిత్రం కూడా మరో లవ్ స్టోరీ. అయితే ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్ కు అథిక ప్రాధాన్యత ఇచ్చారు.

నితిన్ మాట్లాడుతూ...‘ఇష్క్‌' ట్రావెల్‌ లవ్‌స్టోరీ, ‘గుండెజారి గల్లంతయ్యిందే' ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ, ‘హార్ట్‌ ఎటాక్‌' ఎమోషనల్‌ లవ్‌స్టోరీ అయితే ఇది ఫ్యామిలీ ఎమోషన్స్‌ మేళవించిన లవ్‌స్టోరీ. ఇందులో కుటుంబ అనుబంధాలు చాలా బాగుంటాయి. వాటికంటే కూడా ఈ సినిమాలో హీరోయిన్‌ను మరింత ఎక్కువగా ప్రేమించే పాత్ర నాది. ఆ మూడు సినిమాల్లో కంటే ఇందులో క్లైమాక్స్‌ చాలా సా్ట్రంగ్‌గా, చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఎమోషనల్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది అన్నారు.

English summary
Nithin's 'Chinnadana Nee Kosam' completed 50 days run in Two Centres (Santhi 70 MM - Hyderabad, Nataraj - Nizamabad).
Please Wait while comments are loading...