»   » ‘కబాలి’: బెనిఫిట్ షో చూద్దామనుకుంటున్నారా?, మీకు చేదు వార్త

‘కబాలి’: బెనిఫిట్ షో చూద్దామనుకుంటున్నారా?, మీకు చేదు వార్త

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇప్పుడు ఎక్కడ విన్నా 'కబాలి' వార్తలే. సౌతిండియాలోనే కాకుండా ప్రపంచంలోని పలు దేశాల్లో కూడా రజనీ 'కబాలి' గాలి హోరెత్తిస్తోంది. విడుదలకు ముందే నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు, థియేటర్ల యాజమాన్యానికి కాసుల వర్షం కురిపిస్తూ వాళ్లని ఆనంద సాగరాల్లో ముంచెత్తుతోంది. ఈ నేపధ్యంలో బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలు చూసేద్దామని చాలా మంది ఫిక్స్ అయ్యారు. అయితే వారికి చేదు వార్త.

కబాలి చిత్రం తమిళనాడులో గురువారం అర్థరాత్రి నుంచే స్పెషల్ షోస్ మొదలుకానుండగా, తెలుగులో మాత్రం శుక్రవారం రోజునే మొదటి షో ప్రదర్శితం కానుంది. నైజాంలో ఈ సినిమాను విడుదల చేస్తోన్న అభిషేక్ పిక్చర్స్ సంస్థ, గురువారం అర్థరాత్రి బెనిఫిట్ షో లాంటివేమీ వెయ్యటం లేదని, శుక్రవారం రోజునే అన్నిచోట్లా మొదటి షో ఉంటుందని స్పష్టం చేసింది.


No Benefit Shows for Rajani's Kabali

తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల కానున్న ఈ సినిమా కేవలం నైజాంలోనే సుమారు 330లకు పైనే థియేటర్లలో విడుదల కానుంది. మరో ప్రక్కన
'కబాలి' సినిమా టికెట్ల కోసం ఎదురుచూసే వారి సంఖ్య పెరుగుతోంది.


బుక్‌మై షో సైట్/యాప్ ద్వారా మంగళవారం పలు థియేటర్ల టికెట్లను విక్రయానికి పెట్టగా కేవలం మూడు నిమిషాల్లోనే అన్నీ బుక్ అయ్యాయి. దీంతో కాస్త ఆలస్యంగా బుక్ మై షో కు వెళ్ళినవారు నిరాశచెందారు. దీన్ని బట్టి మనం నిర్దారించుకోవచ్చు 'కబాలి' కోసం తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ నెలకొంది అనేది.


మరో ప్రక్క ఈ చిత్రం ఇండియాలో కంటే ముందుగానే అమెరికాలో విడుదల కానుంది. అమెరికాకు ఇండియాకు మధ్య కాల వ్యవధిలో వ్యత్యాసం ఉండడంతో భారత కాలమానం ప్రకారం కబాలి చిత్రం 21న ఉదయం 11 గంటలకు అమెరికాలో తొలి షో ప్రదర్శింపబడనుంది.


ఇంతకు ముందు ఏ చిత్రానికి లేని విధంగా దాదాపు 400 థియేటర్లలో కబాలి విడుదల చేస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే తెలుగు, హిందీ భాషలతో పాటు మళయాలం భాషలో అనువాదం అయిన కబాలి చిత్రాన్ని ఇండోనేషియా, చైనా, థాయ్‌లాండ్, జపాన్ భాషల్లోనూ అనువదించి సెప్టెంబర్‌లో విడుదలకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందన్నది తాజా సమాచారం.

English summary
Nizam distributor Abhishek confirms that there will not be any midnight/special shows of Kabali in Nizam
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu