»   » కృష్ణకు సినిమా కష్టాలు...మహేష్ బాబు లేక పోవడం వల్లే?

కృష్ణకు సినిమా కష్టాలు...మహేష్ బాబు లేక పోవడం వల్లే?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో ఒకప్పుడు సూపర్ స్టార్ గా ఓ వెలుగు వెలిగిన హీరో కృష్ణ. ఇండస్ట్రీలో ఆయనకు ట్రెండ్ సెట్టర్ అనే పేరుంది. తెలుగులో కలర్ చిత్రాలు మొదలైంది ఆయన సినిమాలతోనే...జేమ్స్ బాండ్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు అందించింది కూడా ఆయనే.

సినిమాలే లోకంగా బ్రతికారు కృష్ణ గారు ...చాలా సందర్భాల్లో తన కోసం కాకపోయినా నిర్మాతల కోసం, సినీ కార్మికులకు పని కల్పించాలనే ఉద్దేశ్యంతో సినిమాలు చేసిన గొప్ప మనసున్న వ్యక్తి అంటూ చాలా మంది చెబుతుంటారు. రోజుకు మూడు షిప్టుల్లో పని చేసేవారు. ఆ రోజుల్లో కృష్ణ నటించిన సినిమాలు ఒక్కో ఏడాది 18-20 వరకు విడుదలయ్యేవంటే ఆయన ఎంత కష్టపడే వారో అర్థం చేసుకోవచ్చు.

చాలా సంవత్సరాలు గా మేకప్ కి దూరంగా ఉన్న సూపర్ స్టార్ కృష్ణ నటించిన సినిమా ''శ్రీ శ్రీ '' . ముప్ప‌ల‌నేని శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాలో విజ‌య‌నిర్మ‌ల‌, న‌రేష్ ముఖ్య‌పాత్ర‌లు పోషించారు. కృష్ణ 50 ఏళ్ల సినీజీవితం పూర్తయిన సందర్భంగా 'శ్రీశ్రీ' చేసారు. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా ఆడియో లాంచ్ కు మహేష్ బాబు ముఖ్యఅతిథిగా హాజరు కావడంతో గ్రాండ్ గా జరిగింది.

No buyers for krishna's new movie Sri sri

వాస్తవానికి ఇప్పటికే సినిమా విడుదల కావాల్సి ఉన్నా..... ఇంకాకావడం లేదు. ఇందుకు కారణం ఈ చిత్రాన్ని కొనడానికి ఎవరూ ముందుకు రాక పోవడం వల్లే అని అంటున్నారు. కృష్ణ సినిమాలకు ఇపుడు డిమాండ్ లేక పోవడమే అందుకు కారణం అని టాక్.

శ్రీశ్రీలో మహేష్ బాబు గెస్ట్ రోల్ చేస్తున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ మాట విన్న చాలా మంది బయ్యర్లు ఈసినిమా కొందామనే ఆలోచనకు వచ్చారు. అయితే మహేష్ బాబు ఇందులో నటించడం లేదని తెలిసిన తర్వాత అంతా కామ్ అయిపోయారు. మహేష్ బాబు ఏదైనా చిన్నపాత్ర చేసి ఉంటే పరిస్థితిమరోలా ఉండేదని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

English summary
There is no buyers for Superstar krishna's new movie Srisri.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu