»   » నాని కి మళ్లీ దెబ్బ పడింది

నాని కి మళ్లీ దెబ్బ పడింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నాని ద్విపాత్రాభినయం చేసి విడుదలకు సిద్దంగా ఉన్న చిత్రం 'జెండాపై కపిరాజు'. ఈ చిత్రం తమిళ వెర్షన్ రీసెంట్ గాతమిళంలో విడుదలైంది. జయం రవి హీరోగా చేసిన ఆ వెర్షన్ 'నిమిర్నధు నిల్' టైటిల్ తో విడుదలై నిరాశపరిచింది. దాంతో ఆ ఎఫెక్ట్ ఇక్కడా పడేటట్లు ఉంది. అసలే నాని సినిమాలు పైసా,అహా కళ్యాణం వరసగా భాక్శాఫీస్ వద్ద ఫ్లాఫ్ అయిన నేఫధ్యంలో ఈ చిత్రానికి అసలు క్రేజ్ రాక బిజినెస్ పరంగా సమస్యలు ఎదుర్కొంటోంది. దానికితోడు ఇప్పుడు తమిళంలో ఆడని సినిమా ఇక్కడ ఏం చూస్తారనే టాక్ వినిపిస్తోంది. దాంతో చిత్రం రిలీజ్ తేదీ ఖరారు చేయలేకపోతున్నారు. మల్టి డైమన్షన్స్ వారు ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.

నాని మాట్లాడుతూ... గెలుపంటే అతడికి ఇష్టం. అయితే ఎదుటివాడిని ఓడించేందుకు ముందు తనపై తాను గెలవాలనుకొంటాడు. అదే సిసలైన విజయమని నమ్ముతాడు. ఆ కథేమిటో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అన్నారు. తాను ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నంగా ఈ చిత్రంలో తన క్యారెక్టర్ ఛాలెంజింగ్‌గా ఉంటుందని, చెడు మీద సాగించే యుద్దమే ఈచిత్రం..అందుకే 'జెండాపై కపిరాజు' అనే టైటిల్ పెట్టినట్లు తెలిపారు.

No date in sight for Jenda Pai Kapiraju

దర్శకుడు మాట్లాడుతూ ''దేశానికి సేవ చేయడం కోసం ప్రాణాల్ని అర్పించనక్కర్లేదు. ప్రతి వ్యక్తి తనని తాను సంస్కరించుకుంటే దేశాన్ని సంస్కరించినట్టేనన్న అంశం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతుంది. సున్నితమైన ఈ అంశాన్ని వినోదాత్మకంగా చెబుతున్నాము''అన్నారు. నిర్మాత మాట్లాడుతూ...ఇప్పటికి చిత్రీకరణ పూర్తి చేసుకుంది. నాని ఇందులో చేసే రెండు పాత్రలూ చాలా వైవిధ్యంగా ఉంటాయి. శరత్‌కుమార్ పాత్ర ఈ సినిమాకు మెయిన్ హైలైట్‌గా నిలుస్తుంది అని చెప్పారు.


ఇందులో తండ్రిగానూ,కొడుకు గానూ నాని కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ రెండు పాత్రల్లో తండ్రి పాత్ర నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని ఫిల్మ్ నగర్ సమాచారం. బట్టతలతో ,45 సంవత్సరాల పెద్దాయనగా కనిపిస్తాడు. అమలాపాల్‌ హీరోయిన్ . సముద్రఖని దర్శకుడు. కె.ఎస్‌.శ్రీనివాసన్‌, కె.ఎస్‌.శివరామ్‌ నిర్మాతలు. ఈ చిత్రంలో తమిళ నటుడు శరత్‌కుమార్‌ సి.బి.ఐ. అధికారిగా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.ఆహుతి ప్రసాద్‌, శివబాలాజీ, వెన్నెల కిషోర్‌, ధన్‌రాజ్‌ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఛాయాగ్రహణం: సుకుమార్‌, కూర్పు: ఫాజల్‌, మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్‌.

English summary
The Tamil version of ‘Jenda Pai Kapiraju’ movie is ‘Nimirndhu Nil’ and it has released recently in Tamil Nadu.The movie has received a very lukewarm response in that state and this has caused some concern among the local distributors. 
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu