కథా లేదు...హిట్టూ లేదు(ట్రేడ్ టాక్)

నయనతార,విశాల్ కాంబినేషన్ లో వచ్చిన సెల్యూట్ సినిమా టెక్నికల్ గా చాలా బాగుందనే టాక్ వచ్చినా పోలీస్ స్టోరీ చాలా సార్లు చూసిందే కావటం బోర్ కొడ్తోందని,భారీగా ట్రిమ్ చెయ్యాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అలాగే సినిమాలో మరో ముఖ్యపాత్రలో చేసిన ఉపేంద్ర కే ఎక్కువ మార్కులు పడటం మరో విచిత్రం. అల్లరి నరేష్ ,మంజరి హీరో హీరోయిన్స్ గా వచ్చిన సిద్దు ప్రమ్ సీకాకుళం సినిమా ఫ్రమ్ ఎడ్రసే గానీ టు ఎడ్రస్ (ఏ తరహా ప్రేక్షకుల కోసం) అన్నది స్పష్టంగా మెన్షన్ చేయకపోవటం చీకాకుపరిచి విసిగిస్తోంది.
నూతన దర్శకుడు వెంకట నారాయణ హీరోయిన్ పాత్ర లేకుండా అంతా టీవీ ఆర్టిస్టులతో చేసిన సెల్ సినిమా రిలీజయినట్లు కూడా ఎవరికీ తెలియక పోవటం పెద్ద మైనస్ గా మారింది. హాలీవుడ్ ధ్రిల్లర్ సా ఆధారంగా వచ్చిన ఈ సినిమా ఎక్కడ ఆడుతోందో తెలుసుకుని వెళ్ళేంత ఓపిక,తీరక ఉన్న ప్రేక్షకులు కరువుఅయ్యారు. ఇక ఈ వారం రిలీజైన దాసరి కుమారుడు అరుణ్ కుమార్ హీరోగా వచ్చిన ఆదివిష్ణు సినిమా గోకుల్ ఛాట్ బాంబు ప్రేలుళ్ళ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈ సినిమా ఓ పాత పడ్డ రివేంజ్ డ్రామా లా ముగిసింది.అయితే ఈ విషయం ఓపినింగ్స్ ,మౌత్ టాక్ లేక పోవటంతో ఆ విషయం బయిటకు వచ్చే అవకాశం లేదు.


Click it and Unblock the Notifications











