»   » ఎన్టీఆర్ 'అదుర్స్' 50 డేస్..సెంటర్లు వివరాలు

ఎన్టీఆర్ 'అదుర్స్' 50 డేస్..సెంటర్లు వివరాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

జూ ఎన్టీఆర్, నయనతార, షీలా కాంబినేషన్ లో స్టార్ డైరక్టర్ వివి వినాయక్ రూపొందించిన అదుర్స్ చిత్రం సంక్రాంతి రోజున రిలీజైంది. ఈ చిత్రం రీసెంట్ గా 128 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఓ ప్రక్క తెలంగాణ వాదులు అడ్డుకుంటూ సాగినా ఈ చిత్రం మంచి విజయాన్నే సాధించింది. అయితే మగధీర రికార్డులను మాత్రం దాటలేకపోయింది. అలాగే మంచి రన్నింగ్ లో ఉండగానే నైజాం ఏరియాలోని థియేటర్ల నుంచి అర్థాంతరంగా సినిమాను ఎత్తివేయటం మరో మైనస్. అయితే దాన్ని అధిగమిస్తూ...ఈ చిత్రం ఉత్తరాంధ్రలో 28, తూర్పుగోదావరిలో 17, పశ్చిమగోదావరిలో 12, కృష్ణ 11, గుంటూరు 14, నెల్లూరు 9, సీడెడ్ 37 సెంటర్లలో 50 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక ఈ చిత్రాన్ని కొడాలి నాని, వల్లభనేని వంశీ నిర్మించారు. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం ఆద్యతం కామిడీతో సాగిపోయింది. దేవిశ్రీ ప్రసాద్ పాటలు ఈ చిత్రానికి ప్లస్ అయ్యాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu