»   » జూ.ఎన్టీఆర్ టైటిల్ ‘చక్రవ్యూహం’

జూ.ఎన్టీఆర్ టైటిల్ ‘చక్రవ్యూహం’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇదేంటిది...హీరో ఎన్టీఆర్ కు ఇలాంటి టైటిల్ పెడతారా ...ఇంతకీ డైరక్టర్ ఎవరూ అంటూ కంగారుపడకండి. ఎన్టీఆర్ నటించిన 'బృందావనం'చిత్రాన్ని మళయాళంలో 'చక్రవ్యూహం'టైటిల్ తో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఆగస్టులో ఆడియోని లాంచ్ చేసి, సెప్టెంబర్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఫ్యామిలీ సెంటిమెంట్ తో రూపొందిన ఈ చిత్రం అక్కడ వారినీ ఎట్రాక్ట్ చేస్తుందని భావిస్తున్నారు.

జూ.ఎన్టీఆర్,వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'బృందావనం'. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొంది,తెలుగులో విజయవంతమైన ఈ చిత్రం ఇప్పుడు కన్నడంలోకి రీమేక్ అయ్యింది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రాన్ని కన్నడ స్టార్ హీరో దర్శన్ రీమేక్ చేసారు. ఈ చిత్రం కన్నడ నేటివిటీకి అణుగుణంగా స్క్రిప్టు మార్పులు చేసారు కానీ కన్నడంలో ఓకే ఫిల్మ్ అనిపించుకుంది కానీ పెద్దగా ఆడలేదు.

NTR Brindavanam in Malayalam

ఎన్టీఆర్‌ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.... సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కలయికలో 'రభస' చిత్రం రూపుదిద్దుకొంటోంది. సమంత, ప్రణీత హీరోయిన్స్. బెల్లంకొండ గణేష్‌బాబు నిర్మాత. బెల్లంకొండ సురేష్‌ మాట్లాడుతూ.... ' ఆ కుర్రాడికి దూకుడెక్కువ. మాటల్తో మడతెట్టేస్తాడు. చేతలతో పడగొట్టేస్తుంటాడు. తేడా వస్తే.. రభస చేయడానికి రెడీ అంటాడు. మరి ఆ జోరు ఎలా ఉంటుందో చూడాలంటే.. మా సినిమా వచ్చే వరకూ ఆగాల్సిందే. 'ఆది' తరవాత ఎన్టీఆర్‌తో చేస్తున్న సినిమా ఇది. అభిమానులకు నచ్చేలా ఉంటుంది. ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా తీర్చిదిద్దుతున్నాం. మా సంస్థలో ఇది మరపురాని చిత్రం అవుతుంది'' అని చెబుతున్నారు.

ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : తమన్‌ , ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.

English summary

 NTR's ‘Brindavanam’ is releasing in Malayalam as ‘Chakravyuham’. ‘Chakravyuham’ is all set to release in September after the audio launch in August.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu