»   » ‘రోబో 2.0’:గెస్ట్ రోల్ లో ఆ తెలుగు స్టార్‌ హీరోనా? తెలుగు రైట్స్ కోసం ఈ నిర్మాతలిద్దరూ

‘రోబో 2.0’:గెస్ట్ రోల్ లో ఆ తెలుగు స్టార్‌ హీరోనా? తెలుగు రైట్స్ కోసం ఈ నిర్మాతలిద్దరూ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆలిండియా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా , బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్‌కుమార్‌ విలన్‌గా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సీక్వెల్‌ చిత్రం '2.ఓ'. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదల కార్యక్రమం ముంబయిలో మొన్న ఆదివారం హంగామాగా జరిగిన విషయం తెలిసిందే.

లేటెస్ట్ టెక్నాలిజీకు దర్పణం పట్టేలా ఈ కార్యక్రమం ఉంటుందని ముందుగానే చిత్రయూనిట్‌ ప్రకటించింది. అందుకు తగినట్లేగానే చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక ఈ ఫస్ట్ లుక్ ఫంక్షన్ తో ఒక్కసారిగా సినిమాపై ఓ రేంజిలో హైప్ క్రియేట్ అయ్యింది.

జనాల్లో ఈ సినిమాకు హైప్ క్రియేట్ అయ్యింది ఓకే..ఇప్పుడు ఈ సినిమాకు అన్ని భాషల్లోనూ క్రేజ్ తెచ్చి మార్కెట్ చేయాలనేది నిర్మాతల నెక్ట్స్ వ్యూహం గా కనపడుతోంది. ఆల్రెడీ ఈ సినిమాలో రజనీకాంత్‌ హీరో కాబట్టి తెలుగు,తమిళంకు పెద్ద బాధ లేదు. ముఖ్యంగా తమిళం వాళ్లు ఎగబడి చూస్తారు. అయితే తెలుగునుంచి కూడా ఓ స్టార్ హీరో ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచన దర్శక,నిర్మాతలకు ఉందిట.

 హిందీకు ఉన్నాడు..తెలుగుకు

హిందీకు ఉన్నాడు..తెలుగుకు

హిందీకోసం ..అక్షయ్‌ కుమార్‌ ఉన్నాడు కాబట్టి బాలీవుడ్‌లో మంచి ప్రమోషన్‌ లభిస్తుంది. మరి, తెలుదు మాటేమిటి. అందుకే తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఓ స్టార్‌ హీరోతో ఇందులో ఓ స్పెషల్‌ రోల్‌ చేయించాలని డిసైడ్‌ అయ్యి, చర్చలు జరుపుతున్నట్లు మీడియాలో వార్తలు వినపడుతున్నాయి.

 నిజమైతే సూపర్

నిజమైతే సూపర్

ఇక ఈ చిత్రంలో గెస్ట్ రోల్ గా చేయటానికి ఎన్టీఆర్ ని అడిగారని తెలుస్తోంది. ఎన్టీఆర్ సైతం...తమిళనాట ఈ సినిమాతో క్రేజ్ వస్తుందని భావిస్తున్నారట. మొదట ప్రభాస్ ని అడిగినా ..బాహుబిలి బిజిలో ఉన్నారని చెప్పార. ఎన్టీఆర్ ని అడిగింది నిజమే అయితే సూపర్ అంటున్నారు అభిమానులు.

 రెమ్యునేషన్ ఎక్కువ

రెమ్యునేషన్ ఎక్కువ

ఈ చిత్రంలో గెస్ట్ గా చేసే హీరో కనపడేది చాలా తక్కువ సేపే అంటున్నారు. అయితే రెమ్యునేషన్ మాత్రం గట్టిగా ఇస్తారని చెప్పుకుంటున్నారు. అయితే గెస్ట్ గా చేసే హీరో ఎవరన్నది ఆడియో రిలీజ్ రోజు రివీల్ చేయాలని ఫిక్స్ అయ్యారట.

 గెస్ట్ రోల్ మాత్రమే

గెస్ట్ రోల్ మాత్రమే

తెలుగు మార్కెట్ లో కూడా అదరకొట్టి, జనాలను థియేటర్లవైపు రప్పించడానికి కచ్చితంగా ఓ స్టార్‌ హీరో సహాయం తీసుకోవాలని భావిస్తున్నారని చెప్తున్నారు. సినిమాలో మినిమం ఐదు నిమిషాలైనా ఆ స్టార్‌ హీరో తెరపై కనబడేలా ప్లాన్‌ చేస్తున్నాడట. రజనీ సినిమా కాబట్టి స్టార్ హీరోలు కూడా నో అనకపోవచ్చు అనే ఆలోచనలో ఉన్నారట. ఇంతకీ ఏ స్టార్ హీరో ఈ సినిమాలో చేస్తాడో చూడాలి.

ఈ నిర్మాతలిద్దరూ

ఈ నిర్మాతలిద్దరూ

ఇదిలా ఉంటే...ఈ సినిమాకు భీభత్సమైన హైప్ క్రియేట్ అవటంతో సినిమాని తెలుగులో రిలీజ్ చేయాలని , దాన్ని కొనాలని తిరిగే తెలుగు నిర్మాతల రేసు మొదలైంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ రేసులో బెల్లంకొండ సురేష్, సాహసం శ్వాసగా సాగిపో నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ పంక్షన్ కు అటెండ్ అయ్యారు. వీరిద్దరిలో ఎవరో ఒకరు ఈ రైట్స్ ని చేజిక్కించుకోవాలని బేరసారాలను సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

రేటు మామూలుగా ఉండదు

రేటు మామూలుగా ఉండదు

రజనీకాంత్‌తో తెరకెక్కిస్తున్న 2.ఓ చిత్రాన్ని 350 కోట్లతో రూపొందిస్తున్నారన్నది సమాచారం. దాంతో దానికి తగినట్లే తెలుగు రేటు కూడా ఉండనుంది. ఈ చిత్రాన్ని సాంకేతిక పరంగా హాలీవుడ్ చిత్రాల విలువలను మించే విధంగా తెరకెక్కిస్తున్నట్లు యూనిట్ వర్గాల టాక్. అమెరికాకు చెందిన సాంకేతిక నిపుణులు పలువురు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శంకర్ 3డీ ఫార్మెట్‌లో చిత్రీకరిస్తున్నారు.

 విజువల్స్ ఎఫెక్ట్ పరంగా...

విజువల్స్ ఎఫెక్ట్ పరంగా...

ఈ చిత్రంలో రజనీ సరసన అమీ జాక్సన్ జంటగా నటిస్తుండగా.. అక్షయ్ కుమార్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. మరో బాలీవుడ్ నటుడు సుధన్షు పాండే కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏ‌ఆర్ రెహ్మాన్ స్వరకర్త. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్‌గా నటిస్తోన్న ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఓ కొత్త అనుభూతినిస్తుందని చెప్తున్నారు.

English summary
Producers – Bellamkonda Suresh and ‘Saahasam Swaasaga Saagipo’ fame Miryala Ravinder Reddy are keen on bagging the Telugu Rights of Rajani's ‘2.0’ movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu