»   »  అక్టోబర్ 22 నుంచి ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా ప్రారంభం

అక్టోబర్ 22 నుంచి ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా ప్రారంభం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: శ్రీమంతుడు ఘన విజయం తర్వాత ఎన్టీఆర్ తో దర్శకుడు కొరటాల శివ ఓ సినిమా చేయబోతున్నాడనే సంగతి తెలిసిందే. ఈ చిత్రం అక్టోబర్ 22 నుంచి ప్రారంభం అవుతుందని సమాచారం. ప్రస్తుతం సుకుమార్ తో చేస్తున్న నాన్నకు ప్రేమతో చిత్రం షూటింగ్ పూర్తి కాగానే రెగ్యులర్ షూటింగ్ జరగుతుందని వినపడుతోంది.

ntr 1

నిజానికి రామయ్యావస్తావయ్యా చిత్రం తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించాల్సి ఉంది. అయితే ఈలోపు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ టెంపర్ సినిమా చేయడం, అదే టైం లో మహేశ్ బాబు తో శ్రీమంతుడు చిత్రానికి కొరటాల శివ కమిట్ అవడంతో.. ఈ కాంబినేషన్ వాయిదా పడింది.


ఇక ఎన్టీఆర్ తాజా చిత్రం విషయానికి వస్తే...

ఎన్టీఆర్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మాత. ప్రస్తుతం లండన్‌లో చిత్రీకరణ జరుగుతున్న ఈ సినిమాకు 'నాన్నకు ప్రేమతో' అనే పేరును ఖరారు చేశారు. వినాయక చవితిని పురస్కరించుకొని ఎన్టీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. అందులో ఎన్టీఆర్‌ స్త్టెలిష్‌గా కనిపిస్తున్నారు.


దర్శకుడు మాట్లాడుతూ ''కొత్త తరహా కథ, కథనాలతో తెరకెక్కిన చిత్రమిది. ఎన్టీఆర్‌ పాత్రలోనూ, ఆయన తెరపై కనిపించే విధానంలోనూ వందశాతం వైవిధ్యం చూస్తారు ప్రేక్షకులు. నేను, ఎన్టీఆర్‌ కలిసి తొలిసారి చేస్తున్న ఈ సినిమా మా ప్రయాణంలోనే ప్రత్యేకంగా నిలిచిపోతుంద''న్నారు.

నిర్మాత మాట్లాడుతూ ''ప్రచార చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. విజయదశమికి టీజర్‌ను విడుదల చేయబోతున్నాం. ఎన్టీఆర్‌, సుకుమార్‌ కలయికలో వస్తున్న ఈ చిత్రం మా సంస్థకి ఎంతో ప్రతిష్ఠాత్మకం. ఈ నెల 24 వరకు లండన్‌లో కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తాం. జనవరి 8న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''న్నారు.

ntr 2

ఈ చిత్రం కథలో ఓ సర్పైజ్ ఉండబోతోందని సమాచారం.అది మరేదో కాదు ఎన్టీఆర్ ద్వి పాత్రాభినయం చేస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటివరకూ బయిటకు వచ్చింది ఎన్టీఆర్ ఒక పాత్ర గెటప్ అని, రెండో గెటప్ గోప్యంగా ఉంచాలని యూనిట్ నిర్ణయించుకుందని సమాచారం. గతంలోనూ ఎన్టీఆర్...అదుర్స్ చిత్రంలో డ్యూయిల్ రోల్స్ చేసారు. అది మంచి హిట్టైంది. అయితే ఈ డ్యూయిల్ రోల్ విషయమై అఫీషియల్ కన్ఫర్మేషన్ మాత్రం లేదు.

జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఛాయాగ్రహణం: విజయ్‌ చక్రవర్తి

English summary
NTR's next with Koratala Shiva is all set to star from Oct, 22nd.
Please Wait while comments are loading...