»   » ఇదీ ఎన్టీఆర్ స్టామినా : చదవండి షాక్ అవుతారు

ఇదీ ఎన్టీఆర్ స్టామినా : చదవండి షాక్ అవుతారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సంక్రాంతికి వచ్చిన ‘నాన్నకు ప్రేమతో' చిత్రంతో ఎన్టీఆర్ కు క్రేజ్ రెట్టింపైంది. ఈ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు తన తదుపరి చిత్రంపై దృష్టిపెట్టాడు. ‘మిర్చి', ‘శ్రీమంతుడు' చిత్రాల క్రేజ్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రం ఫిబ్రవరి మొదటివారంలో సెట్స్‌పైకి రానుంది.

క్రేజీ కాంబినేషన్ కావటంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ మొదలు కాకముందే బిజినెస్ విషయంలో సంచలనం సృష్టిస్తోంది. ‘నాన్నకు ప్రేమతో' సినిమాతో ఓవర్‌సీస్‌లో క్రేజీ మార్కెట్‌ను స్వంతం చేసుకున్న ఎన్టీఆర్‌కు ఈ సినిమా దానికి రెట్టింపు మొత్తంలో బిజినెస్ జరిగిందని తెలిసింది.

మరోవైపు ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో భారీ సెట్టింగులు నిర్మిస్తున్నారు. ‘జనతా గ్యారేజ్' పేరుతో తెరకెక్కే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది తెలియాల్సి వుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మరో కొత్త లుక్‌లో కన్పిస్తాడట. ఈ చిత్రంలో మరో ముఖ్యపాత్రలో ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్ తనయుడు ముకుందన్ నటిస్తాడని తెలిసింది. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

ఏ ఏరియాలో..ఎంత ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందనేది చూడండి.

నైజాం

నైజాం

మొదటి నుంచీ ఎన్టీఆర్ కు నైజాం ఏరియాలో మంచి పట్టుంది. అందుకే అక్కడ 15 కోట్లు కు అమ్ముడైనట్లు సమాచారం.

సీడెడ్

సీడెడ్

నైజాం తర్వాత ఎన్టీఆర్ కు ఎక్కువ మార్కెట్ అయ్యేది సీడెడ్ లో. సీడెడ్ లో ఈ చిత్రం 9 కోట్లు బిజినెస్ చేసింది.

ఆంధ్రా

ఆంధ్రా

ఆంధ్రాలో మిగిలిన జిల్లాలలో 21 కోట్లు వరకూ బిజినెస్ జరిగిందని సమాచారం.

కర్ణాటక

కర్ణాటక

ఎన్టీఆర్ కు కర్ణాటకలో ఉన్న ఫ్యాన్ బేస్ తో ఈ సినిమాని అక్కడ ఐదున్నర కోట్లకు అమ్మారు.

ఓవర్ సీస్

ఓవర్ సీస్

నాన్నకు ప్రేమతో చిత్రం ఓవర్ సీస్ లో కుమ్మేసింది. దాంతో అక్కడ ఏడు కోట్ల ఇరవై లక్షలుకు అమ్మారు.

నార్త్ లో

నార్త్ లో

ఎన్టీఆర్ కు కొంత మార్కెట్ నార్త్ లోనూ ఉంది. డబ్బింగ్ చేసి టీవిల్లో వేస్తున్న చిత్రాలతో వచ్చిన క్రేజడ్ తో కోటి రూపాయలుకు అక్కడ బిజినెస్ జరిగింది.

డబ్బింగ్ రైట్స్

డబ్బింగ్ రైట్స్

ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ (తమిళ,మళయాళం) కు ఆరు కోట్ల మూడు లక్షలకు వెళ్లింది.

శాటిలైట్ రైట్స్

శాటిలైట్ రైట్స్

ఇదిమిద్దంగా ఇంత అని తెలియదు కానీ శాటిలైట్ కూడా దాదాపు పది కోట్ల దాకా బిజినెస్ జరుగుతోందని అంటున్నారు.

మొత్తం

మొత్తం

శాటిలైట్ తో కలిసి ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ 65 కోట్లు + 10 కోట్లు అని సమాచారం.

నాన్నకు ప్రేమతో ఎఫెక్ట్

నాన్నకు ప్రేమతో ఎఫెక్ట్

ఎన్టీఆర్ లేటెస్ట్ చిత్రం టాక్ డివైడ్ గా ఉన్నా కలెక్షన్స్ కురుస్తూండటమే ఈ సినిమా ఈ స్ధాయిలో అమ్ముడుపోవటానికి కారణం అంటున్నారు

English summary
Janata Garage movie has done record pre-release business in NTR's career.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu