»   » ఇదీ ఎన్టీఆర్ దమ్ము: 'జనతాగ్యారేజ్' ఫైనల్ కలెక్షన్స్, టోటల్ రెవెన్యూ (ఏరియావైజ్)

ఇదీ ఎన్టీఆర్ దమ్ము: 'జనతాగ్యారేజ్' ఫైనల్ కలెక్షన్స్, టోటల్ రెవెన్యూ (ఏరియావైజ్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌కి 2016 బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఆయనికిది నిజంగా ఇది గోల్డెన్ ఇయర్. యంగ్ టైగర్ కు దాదాపు 12 ఏళ్లుగా సరైన హిట్ పడలేదు. జనతా గ్యారేజ్ సక్సెస్ సందర్భంగా ఎన్టీఆర్ స్వయంగా ఈ సంగతి చెప్పాడు. ఇంతకాలానికి తన కృషి ఫలించిందన్నాడు. ఇన్నేళ్లుగా హిట్ కోసం తపించానన్నాడు. అలాంటిది ఒకే ఏడాది రెండు హిట్స్ కొట్టేసి నిజంగా టైగర్ అనిపించుకున్నాడు.

కుట్ర: ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' ఆన్ లైన్లో పెట్టారు (లింక్)


బాక్సాఫీస్ కలెక్షన్స్ లో ఇంతకు ముందు ఎన్నడూ ఏ టాలీవుడ్ హీరోకూ దక్కని రికార్డు ఎన్ టిఆర్ కు దక్కింది అదీ జనతాగ్యారేజ్ రూపంలో. జయహో జనతా అంటున్నారు అభిమానులు. రికార్డుల సునామీ సృష్టించారు. ఎన్టీఆర్ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది.


ఇది ఎన్టీఆర్ 'సర్కార్' ... ('జనతా గ్యారేజ్‌' రివ్యూ)


మొత్తంగా గ్యారేజ్ లో కలెక్షన్స్ సునామీ సృష్టించింది. తెలుగు సినీ ఇండస్ట్రీలోనే హయ్యస్ట్ వసూలు చేసిన సినిమాల్లో మూడో స్థానంలో నిలిచింది. ఫస్ట్ ప్లేస్ లో బాహుబలి, సెకండ్ ప్లేస్ లో శ్రీమంతుడు ఉన్నాయి.


అత్తారింటికి దారేదీ, మగధీర రికార్డ్స్ ను వెనక్కి నెట్టి జయహో జనతా అంటున్నారు. సినిమా కొనుక్కున్న వాళ్ళందరికీ బాగా లాభాలు తెచ్చి పెట్టింది. ఇంతకీ జనతాగ్యారేజ్..టోటల్ రన్ లో ఎంత షేర్ తెచ్చుకుంది . ట్రేడ్ వర్గాలనుంచి తీసుకున్న లెక్కలను మీ ముందు ఉంచుతున్నాం.


ఇదీ నైజాం లెక్క

ఇదీ నైజాం లెక్క

జనతాగ్యారేజ్ చిత్రం నైజాం లో 19 కోట్లు షేర్ సాధించిందీ చిత్రం. ఎన్టీఆర్‌, సమంత, నిత్యామీనన్‌ హీరో హీరోయిన్లుగా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై కొరటాల శివ దర్శకత్వంలో ఎర్నేని నవీన్‌, యలమంచిలి రవిశంకర్‌, సి.వి.మోహన్‌ నిర్మించిన చిత్రం 'జనతాగ్యారేజ్‌'. సెప్టెంబర్‌ 1న సినిమా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపింది.


సీడెడ్ లో దుమ్ము రేపింది

సీడెడ్ లో దుమ్ము రేపింది

జనతాగ్యారేజ్ చిత్రం సీడెడ్ లో 12 కోట్లు షేర్ సాధించింది రికార్డ్ క్రియేట్ చేసింది. తొలి రోజు డివైడ్ టాక్ వచ్చినా.. ప్రేక్షకులు మాత్రం సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఎన్టీఆర్ సినీ ప్రస్థానంలోనే ఇంత పెద్ద హిట్ మరొకటి లేదు.


ఉత్తరాంధ్రలో కేక పెట్టించింది

ఉత్తరాంధ్రలో కేక పెట్టించింది

జనతాగ్యారేజ్ చిత్రం ఉత్తరాంధ్రలో 7.6 కోట్లు షేర్ సాధించింది రికార్డ్ క్రియేట్ చేసింది. 13 ఏళ్లపాటు బిగ్ హిట్ కోసం ప్రయత్నించిన ఎన్టీఆర్ కరువు తీరిందని.. 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడని అభిమానులు ఆనందపడుతున్నారు.


తూర్పుగోదావరిలో ఇలా

తూర్పుగోదావరిలో ఇలా

జనతాగ్యారేజ్ చిత్రం తూర్పు గోదావరి లో 4.95 కోట్లు షేర్ సాధించింది రికార్డ్ క్రియేట్ చేసింది. జనతాగ్యారేజ్ కలెక్షన్స్ రికార్డ్స్ క్రియేట్ చేయటం వెనక.. ధియేటర్లలో టికెట్ రేట్లు పెంచటం కూడా ఓ కారణం ఉందనే వార్తలు మీడియాలో వస్తున్నాయి కానీ నిజానికి అందులో పూర్తి నిజం అయితే లేదు.


పశ్చిమ గోదావరి జిల్లాలో ...

పశ్చిమ గోదావరి జిల్లాలో ...

జనతాగ్యారేజ్ చిత్రం పశ్చిమ గోదావరి జిల్లా లో 4.3 కోట్లు షేర్ సాధించింది రికార్డ్ క్రియేట్ చేసింది. సింగిల్ స్క్రీన్స్ లో 70 రూపాయలు ఉన్న బాల్కనీ.. జనతా కోసం వంద రూపాయలు చేయటంతోనే ఇది సాధ్యం అయ్యిందని టాలీవుడ్ టాక్. ఎవరి అంచనాలు, లెక్కలు వాళ్లకు ఉంటాయి మరి.


కృష్ణాలో కుమ్మేసింది

కృష్ణాలో కుమ్మేసింది

జనతాగ్యారేజ్ చిత్రం కృష్ణా జిల్లా లో 4.4 కోట్లు షేర్ సాధించింది రికార్డ్ క్రియేట్ చేసింది. మొత్తానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. కొన్నాళ్ళుగా వరుస ప్లాపులతో ఫ్యాన్స్ ని ఆందోళనకు గురి చేసిన ఎన్టీఆర్, త్వరలో తన అభిమానులు కాలర్ ఎత్తుకునేలా చేస్తానని ఓ ఫంక్షన్ లో మాట ఇచ్చాడు. దాన్ని నిలబెట్టుకున్నాడు.


గుంటూరులో ఓ రేంజిలో ఇలా

గుంటూరులో ఓ రేంజిలో ఇలా

జనతాగ్యారేజ్ చిత్రం గుంటూరు జిల్లా లో 6.1 కోట్లు షేర్ సాధించింది రికార్డ్ క్రియేట్ చేసింది. 39 కేంద్రాలలో 50 రోజులు పూర్తి చేసుకుంది జనతా గ్యారేజ్. ఈ చిత్రం అక్టోబర్ 23న బుల్లి తెరపై ప్రదర్శితం అయ్యింది.


నెల్లూరులో జనతా లాభాలే లాభాలు

నెల్లూరులో జనతా లాభాలే లాభాలు

జనతాగ్యారేజ్ చిత్రం నెల్లూరు జిల్లా లో 2.35 కోట్లు షేర్ సాధించింది రికార్డ్ క్రియేట్ చేసింది. ఒక్కోసారి కొన్ని సినిమాలు సుడిగాలిలా వచ్చేస్తాయి. ఒక ప్రభంజనంలా జనాన్ని చుట్టుముడతాయి. ఎక్కడ విన్నా ఆ సినిమా గురించే వినిపిస్తుంది. అందరూ ఆ మూవీ గురించే చెప్పుకుంటారు. అలాంటిదే ఈ సినిమా కూడా.


ఎపి, నైజాం కలిపితే...

ఎపి, నైజాం కలిపితే...

జనతాగ్యారేజ్ చిత్రం ఆంధ్రా, నైజాం కలిపితే లో 60.7 కోట్లు షేర్ సాధించింది రికార్డ్ క్రియేట్ చేసింది. గత ఏడాది బాహుబలి ఇలాంటి సంచలనం సృష్టించింది. ఈ ఏడాది అలా ప్రభంజనాన్ని రేపుతున్న సినిమా జనతా గ్యారేజ్. కలెక్షన్స్ లో పాత రికార్డుల్ని ఓవర్ టేక్ చేసింది.


కర్ణాటకలోనూ మామూలుగా లేదుగా

కర్ణాటకలోనూ మామూలుగా లేదుగా

జనతాగ్యారేజ్ చిత్రం కర్ణాటకలో 7.9 కోట్లు షేర్ సాధించింది రికార్డ్ క్రియేట్ చేసింది. జనతా గ్యారేజ్ ... జనానికి బాగా కనెక్ట్ అయింది. రిలీజైన మొదటి రోజు నార్మల్ అని టాక్ వచ్చినా...ఆ తర్వాత డే బై డే అదరగొట్టింది. కలెక్షన్ల సునామీ సృష్టించింది. సెకండ్ డే నుంచే ఈ పిక్చర్ పికప్ అయింది. కొన్ని ఏరియాల్లో ‘బాహుబలి'ని మించిపోయేలా కలెక్షన్స్ వచ్చాయి.


యుఎస్ లోనూ ఈ రేంజిలో కలెక్షన్స్

యుఎస్ లోనూ ఈ రేంజిలో కలెక్షన్స్

జనతాగ్యారేజ్ చిత్రం యుఎస్ లో 7.23 కోట్లు షేర్ సాధించింది రికార్డ్ క్రియేట్ చేసింది.అమెరికాలో ఎన్టీఆర్ మూడు సినిమాలు టెంపర్, నాన్నకు ప్రేమతో..., జనతా గ్యారేజ్ ... వరసగా మిలియన్ డాలర్లను వసూలు చేయడం. ఇది హ్యాట్రిక్కే.


అక్కడా వదలలేదుగా

అక్కడా వదలలేదుగా

జనతాగ్యారేజ్ చిత్రం తమిళనాడు లో 1.07 కోట్లు షేర్ సాధించింది రికార్డ్ క్రియేట్ చేసింది. చెన్నైలోని ఎస్.ఆర్.ఎం యూనివర్సిటీలో జనతాగ్యారేజ్ బెనిఫిట్ షో టికెట్లను తెలుగుదేశం పార్టీ చెన్నై యువసేన విభాగం వేలం వేసింది. వీటికి భారీ రెస్పాన్స్ రాగా, ఎన్టీఆర్ అంటే అమితంగా ఇష్టపడే ఓ అభిమాని వేలంలో బెనిఫిట్‌ షో మొదటి టిక్కెట్ ని 31, 000కి కొనుక్కున్నాడు. ఇక రెండు మరియు మూడవ టిక్కెట్స్ 17,500 మరియు 13,000కి అమ్ముడుపోయాయి.


ఇవి కాక మనదేశంలో మిగిలిన ప్రాంతాలు

ఇవి కాక మనదేశంలో మిగిలిన ప్రాంతాలు

జనతాగ్యారేజ్ చిత్రం మనదేశంలో పైన చెప్పిన ప్రాంతాలు కాక మిగతా చోట్ల 95 లక్షలు షేర్ సాధించింది రికార్డ్ క్రియేట్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా...ఇండియాలోను, ఓవరీస్ లో కూడా జనతా ప్రభంజనం వీస్తోంది. ఓవర్సీస్ లో ఇప్పటివరకు మహేష్ బాబుదే పై చేయి అని అంటారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇప్పుడు ఆ రేంజ్ కి వచ్చేశాడు.


పైన చెప్పిన చోట్ల కాకుండా మిగిలిన ప్రంపంచంలో

పైన చెప్పిన చోట్ల కాకుండా మిగిలిన ప్రంపంచంలో

జనతాగ్యారేజ్ చిత్రం పైన చెప్పిన ఏరియాలు కాకుండా మిగిలిన ప్రపంచంలో లో 1.65 కోట్లు షేర్ సాధించింది రికార్డ్ క్రియేట్ చేసింది. జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ రికార్డులతో జూనియర్ ఎన్ టీఆర్ కూడా ఓవర్సీస్ వసూళ్లలో మహేష్ బాబు, పవన్ కల్యాణ్, బాలకృష్ణ జాబితాలో చేరిపోయాడు.


వరల్డ్ వైడ్ తెలుగు వెర్షన్ కి

వరల్డ్ వైడ్ తెలుగు వెర్షన్ కి

జనతాగ్యారేజ్ చిత్రం వరల్డ్ వైడ్ తెలుగు వెర్షన్ మొత్తం 79.5 కోట్లు షేర్ సాధించింది రికార్డ్ క్రియేట్ చేసింది. ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా రూ.32 కోట్లకు పైగా కలెక్ట్ చేయటం ప్లస్ అయ్యింది. బాహుబలి తర్వాత ఆ రేంజ్ లో కలెక్షన్లు రాబట్టిన మూవీగా జనతాగ్యారేజ్ స్టాండ్ అయింది.


కేరళలలో...

కేరళలలో...

జనతాగ్యారేజ్ చిత్రం వరల్డ్ వైడ్ కేరళ వెర్షన్ మొత్తం 1.8 కోట్లు షేర్ సాధించింది. ఈ పిక్చర్ కు ఒక పాయింట్ బాగా కలిసొచ్చింది. విడుదలైన రోజు నుంచి సెలవులు రావడంతో కలెక్షన్లు పుంజుకున్నాయి.


ఫైనల్ గా ఇంత షేర్

ఫైనల్ గా ఇంత షేర్

జనతాగ్యారేజ్ చిత్రం వరల్డ్ వైడ్ కేరళ ,తెలుగు వెర్షన్ లు మొత్తం 81.3 కోట్లు షేర్ సాధించి,రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు పోటీగా మరే సినిమా లేకపోవడంతో హిట్ టాక్ వస్తే మంచి వసూళ్ళు రాబట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు వేసిన అంచనా ఈ చిత్రం విషయంలో నిజమైంది.


కన్నడవాళ్ళకి పిచ్చపిచ్చగా

కన్నడవాళ్ళకి పిచ్చపిచ్చగా

ఈ మధ్య మన తెలుగు హీరోలు ప్రక్క రాష్ట్రాల్లోని హీరోలకు పోటీగా తమ సినిమాలను రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో తెలుగు హీరోలకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే బన్నీకి మలయాళంలో ఓ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా ఎన్టీఆర్ కి కర్ణాటకలో అభిమానులు విపరీతంగా పెరిగిపోయారు. జనతా గ్యారేజ్ చిత్రం కర్ణాటకలో రికార్డ్ షేర్ ను సాధించి అందరిని ఆశ్చర్యపరచింది. గతంలో బాహుబలి సినిమా కర్ణాటకలో రిలీజైన తెలుగు సినిమాగా రికార్డుకెక్కగా, ఇప్పుడు జనతా గ్యారేజ్ తరువాత స్థానంలో నిలిచింది. కర్ణాటకలో ఎన్టీఆర్ కి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో నిరూపించింది .


ఏ హీరోకు లేని రికార్డ్

ఏ హీరోకు లేని రికార్డ్

ఈ సినిమాతో జూనియర్ నెలకొల్పిన కొత్త రికార్డ్ ఏంటంటే...ఎన్టీఆర్ ఈ ఏడాది 200 కోట్ల రూపాయల కలెక్షన్ రికార్డును క్రియేట్ చేసాడు. ఎన్టీఆర్ నటించిన రెండు సినిమాలు... నాన్నకు ప్రేమతో..., జనతాగ్యారేజ్ ఈ ఏడాది రిలీజయ్యాయి. మొదటిది సెంటిమెంట్ మూవీ అయితే... రెండోది మెసేజ్ మూవీ. నాన్నకు ప్రేమతో... సినిమా వరల్డ్ వైడ్ గా 90 కోట్లు కలెక్ట్ చేసింది.


ముందే ఎక్సపెక్ట్ చేసాడు

ముందే ఎక్సపెక్ట్ చేసాడు

సక్సెస్ మీట్ లో ఎన్టీఆర్‌ మాట్లాడుతూ - ''ఆడియో ఫంక్షన్‌లో నాకు ఒక వెలుగు కనిపిస్తుందని చెప్పాను. ఆ వెలుగు జనతాగ్యారేజ్‌ అని తెలుస్తుంది. సినిమా సెప్టెంబర్‌ 1న విడుదలైనప్పుడు చాలా రకాలుగు రిపోర్ట్స్‌ వచ్చినప్పుడు కాసేపు ఏం మాట్లాడాలో, ఎలా రియాక్ట్‌ కావాలో తెలియలేదు. శివపై, ఈ కథపై పెట్టుకున్న నమ్మకం, అభిమానులకు ఇచ్చిన మాట తప్పు కాకూడదే అని లోపల చాలా బాధ పడిపోయాను అని ఎన్టీఆర్ తెలిపారు.


ఇంతకంటే ఏం కావాలి

ఇంతకంటే ఏం కావాలి

రిలీజైన రోజు అభిమానుల నుండి సాయంత్రం రిపోర్ట్స్‌ వింటుంటే ఈ మాటలు వినడానికి నాకు ఇన్నేళ్ళు పట్టిందా,ఇంతకంటే నాకేం అవసరం లేదనిపించింది. జనతాగ్యారేజ్‌ వల్ల అభిమానుల ముఖాల్లో సంతోషం, నా తల్లిదండ్రుల పుట్టినరోజున మంచి గిఫ్ట్‌ ఇచ్చినవాడినయ్యాను అన్నారు అని ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు.


తలెత్తుకునేలా చేసావు కదా బయ్యా

తలెత్తుకునేలా చేసావు కదా బయ్యా

ఇలాంటి విజయం కోసమే నేను ఇనేళ్ళు ఆగాను. నా వెనుక నా అభిమానులు ఆగారు. అభిమానులు ముందు తలెత్తుకునేలా చేసిన జనతాగ్యారేజ్‌ సినిమాను ఇచ్చిన కొరటాలశివగారికి ఆజన్మాంతం రుణపడి ఉంటాను. నాపై అభిమానులు పెట్టుకున్న నమ్మకాన్ని ఈ సినిమాతో నిజం చేశారు. నా గుండెలో, అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విజయమిదని ఎన్టీఆర్ తెలిపారు.


రూటు మార్చి హిట్ కొట్టాడు

రూటు మార్చి హిట్ కొట్టాడు

కొరటాల శివ మాట్లాడుతూ - ''ఎన్టీఆర్‌ అంటనే నాకు సపరేట్‌ ఎనర్జీ. తారక్‌కి సక్సెస్‌ కొత్తకాదు. అయినా ఈ సక్సెస్‌లో నేను కూడా భాగం అయినందుకు చాలా ఆనందంగా ఉంది. టెంపర్‌ నుండి రూట్‌ మార్చి కొత్తగా చేస్తున్నారు. అలా చేయడం ఆడియెన్స్‌కు నచ్చింది, ఆదరిస్తున్నారు. అభిమానులు ఆదరణ ఇలాగే కొనసాగితే టెంపర్‌, నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్‌ వంటి సినిమాలు ఎన్నింటినో చేస్తారు. అలాగే ఈ సినిమాను పెద్ద సక్సెస్‌ చేసిన ఆడియెన్స్‌కు పెద్ద థాంక్స్‌. జయహో జనతా''అన్నారు.


English summary
‘Janatha Garage’ has amassed about Rs.82 Crore Share in its full run at the box- office which makes its the third biggest hit ever in the history of Telugu Cinema Industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu