»   » జపాన్ ఫ్యాన్స్ కోరిక మేరకు ఎన్టీఆర్...

జపాన్ ఫ్యాన్స్ కోరిక మేరకు ఎన్టీఆర్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రజనీకాంత్ లాగానే ఎన్టీఆర్ కు జపాన్ లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ఎన్టీఆర్ చిత్రాన్ని అక్కడ విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ చిత్రం మరేదో కాదు నాన్నకు ప్రేమతో.

మొన్న సంక్రాంతికి విడుదలైన ఎన్టీఆర్ చిత్రం నాన్నకు ప్రేమతో. ఈ చిత్రం మొదట డివైడ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ బాగానే వచ్చాయి. దాంతో అదే ఊపులో .. జపాన్ లోను తన హవా చూపించేదుకు రెడీ అయింది. జపాన్ లో ఎన్టీఆర్ అభిమానుల కోరిక మేరకు ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.


Ntr's Nannaku Prematho Going Japan

ఫ్యామిలీ రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లోనే 50 కోట్లు దాటిన చిత్రంగా రికార్డులకెక్కటంతో ఈ ధైర్యం చేస్తున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న జపాన్ లో ఈ చిత్రం రిలీజ్ కానుంది .


మొదట ఈ చిత్రాన్ని డబ్ చేసి రిలీజ్ చేయాలనుకున్నారు కానీ.. దానికి మరింత సమయం,ఖర్చు అవుతుందని భావించిన నిర్మాతలు.. డైరెక్ట్ గా తెలుగు వెర్షన్ నే జపనీస్ సబ్ టైటిల్స్ తో రిలీజ్ చేస్తున్నారు. ఇది సాంపిల్ మాత్రమే.. వేసవిలో జపాన్ బాషలోకి డబ్ చేసి మరోసారి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.

English summary
NTR and his makers have decided to release Nannaku Prematho in Japan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu