»   » ఎన్టీఆర్..మజాకానా..మాటలు కాదు 60 కోట్లు

ఎన్టీఆర్..మజాకానా..మాటలు కాదు 60 కోట్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదారాబాద్ : ఎన్టీఆర్ చిత్రానికి సాధారణంగానే బిజినెస్ ఓ రేంజిలో అవుతోంది. దానికి తోడు క్రేజీ డైరక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించటం కలిసి వచ్చింది. దాంతో మూడు ఏరియాలకు 31 కోట్లు బిజినెస్ జరిగి రికార్డ్ క్రియేట్ చేసింది.

వివరాల్లోకి వెళితే...ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో' తన 25వ సినిమా అవ్వడం, దీనికి క్రేజీ డైరక్టర్ సుకుమార్ దర్శకత్వం తోడవ్వడంతో దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అత్యంత ప్రజాదరన కలిగిన టీసర్ ఈ సినిమాకి కావలసినంత ఊతం లభించేలా చేసింది..అందుకే బయ్యర్లను బాగా ఆకర్షించిందీ చిత్రం... సంక్రాంతికి గ్రాండ్ గా డిసెంబర్ 13న రిలీజ్ అవ్వనున్న ఈ సినిమా బిజినేస్ చాలా జోరుగా సాగిందని ట్రేడ్ వర్గాల సమాచారం.


NTR's Nannaku Prematho Pre Release Business Details

ఈ చిత్రం నైజాం రైట్స్ ను అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ రూ.16 కోట్లకు సొంతం చేసుకున్నారు. అలాగే ఓవర్సీస్ లో ఈ సినిమా రూ. 7.10 కోట్లకు అమ్ముడై ఆల్ టైం రికార్డు అందుకుంది. ఇక సీడెడ్ లో ఎన్టీఆర్ కేరీర్ లోనే హయ్యస్ట్ గా రూ 8.45 కోట్లకు అమ్ముడైనట్టు తెలుస్తోంది. దీంతో ఈ మూడు ఏరియాల టోటల్ బిజినెస్ రూ.31 కోట్ల మార్క్ కు చేరింది.


దాంతో మిగతా ఏరియాల్లో కూడా ఇదే రేంజ్ లో బిజినెస్ జరగడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. మిగిలిన కోస్తా, కర్ణాటక, చెన్నై బిజినెస్ తో కలుపుకుంటే రూ.60 కోట్ల వరకు ఈ సినిమా బిజినెస్ జరుగుతుందని అంటున్నారు.

English summary
Jr NTR’s upcoming Tollywood movie Nannaku Prematho pre release business details are here, it is expected that this Telugu movie is going to get more than 60 crore.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu