»   » ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో': టీజర్ విడుదల తేదీ

ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో': టీజర్ విడుదల తేదీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'టెంపర్' హిట్ తో మంచి జోష్ మీద ఎన్టీఆర్ ఉత్సాహంగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో 25 వ చిత్రం. జనవరి 8,2016న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. నవంబర్ దాకా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. అలాగే ఈ చిత్రం టీజర్ ని సెప్టెంబర్ 17 న అంటే వినాయిక చవతి రోజున పండుగ కానుకగా విడుదల చేస్తున్నారు.

ప్రస్తుతం లండన్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ గా చేస్తోంది. జగపతిబాబు కీలకమైన పాత్రలోనూ, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తారు. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్ ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోనుంది.

ఇక ఈ చిత్రానికి టైటిల్ ఇప్పటివరకూ ఖరారు చేయలేదనే సంగతి తెలిసిందే. నాన్నకు ప్రేమతో అనే టైటిల్ తోనే వ్యవహిస్తున్నారు. ఈ టైటిల్ నే ఖరారు చేస్తూ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లో పోస్ట్ చేసాడు.

 NTR'S Nannaku Prematho: teaser release date

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

చిత్రం మరిన్ని విశేషాలకు వస్తే...

ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం వచ్చే క్రేజ్ ఎలా ఉంటుందో తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం ప్రి బిజినెస్ క్రేజీ రేట్లతో క్లోజ్ అయిపోయినట్లు సమాచారం. అంతేకాదు ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ కూడా రీసెంట్ గా అమ్ముడయినట్లు తెలుస్తోంది. టాక్స్ మొత్తం తో కలిపి 10.5 కోట్లకు (చెల్లించిన మొత్తం 9 కోట్లు) తో జెమినీ ఛానెల్ వారు ఈ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

ఈ చిత్రం నిమిత్తం దర్శకుడు సుకుమార్ ప్రత్యేకమైన బైక్ ని డిజైన్ చేయించారు. ఈ బైక్ మీద ఎన్టీఆర్ ఈ చిత్రంలో తిరుగుతూంటారు. శ్రీమంతుడులో సైకిల్ మీద మహేష్ తిరుగుతూ క్రేజ్ వచ్చినట్లే ఈ బైక్ మీద ఎన్టీఆర్ తిరుగుతూంటే సూపర్ గా ఉంటుందని చెప్తున్నారు.

అలాగే.. ఈ చిత్రం కొన్ని కొత్త విషయాలు బయిటకు వచ్చాయి. ఈ చిత్రానికి 'నాన్నకు..ప్రేమతో' టైటిల్ నే ఫైనలైజ్ చేయనున్నారు. అలాగే ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పేరు అభిరామ్. అయితే ఇదే ఖరారు అని చెప్పలేం. ఇవి ఫిల్మ్ సర్కిల్ లో ప్రచారంలో ఉన్న విషయాలు మాత్రమే.

దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ... ఎన్టీఆర్ తో ఫస్ట్ టైమ్ వర్క్ చేయటం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. తారక్ లో ఎంతో ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీని ఎలివేట్ చేసే స్కోప్ ఉన్న సబ్జెక్ట్ ఇది. ఇది ఓ రివేంజ్ డ్రామా. డిఫెరెంట్ స్టైల్ లో ఉంటుంది అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ... ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఎన్టీఆర్ కు డిఫెరెంట్ మూవి అవుతుంది. సబ్జెక్టు చాలా ఎక్సట్రార్డనరీగా ఉంది అన్నారు.

English summary
NTR – Sukumar film Nannaku Prematho movie’s first teaser will be out on 17th September, on the eve of Vinayaka Chaviti. BVSN Prasad in association with Reliance Entertainments is producing the film. Nannaku Prematho is scheudled for Jan 8, 2016 release.
Please Wait while comments are loading...