»   » ఇదీ జూ.ఎన్టీఆర్ మార్కెట్...స్టామినా

ఇదీ జూ.ఎన్టీఆర్ మార్కెట్...స్టామినా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజాచిత్రం 'రభస'. సమంత, ప్రణీత ఎన్టీఆర్‌కు జోడీగా నటిస్తున్నారు. శ్రీ లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై బెల్లంకొండ సురేష్‌, బెల్లంకొండ గణేష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్‌తో 'కందిరీగ' తీసి తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్న సంతోష్‌ శ్రీనివాస్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం బిజినెస్ మంచి క్రేజ్ తో సాగుతోంది. ప్రస్తుతం చిత్రానికి సంభందించి నెగోషియేషన్స్ జరుగుతున్నట్లు సమాచారం. ట్రేడ్ లో వినపడుతున్న వివరాల్లోకి వెళితే...

నెల్లూరు రైట్స్ ని కొత్త పార్టీ 1.9 కోట్లు కి సొంతం చేసుకున్నారు. హరి పిక్చర్స్ వారు గుంటూరు,కృష్ణా రైట్స్ కు నెగోషియేట్ చేస్తున్నారు. గుంటూరుకి 3.85 కోట్లు, మొత్తం అయితే ఆరు కోట్లుకు ఫైనల్ చేయాలని హరి భావిస్తున్నారు. అనుశ్రీ ఫిల్మ్స్ వారు తూర్పు గోదావరి, ఉషా పిక్చర్స్ వారు పశ్చిమ గోదావరి అడుగుతున్నారు. దిల్ రాజు,భారత్ లు వైజాగ్ రైట్స్ కు రేసులో ఉన్నారు.

ఇక నైజాం రైట్స్ ని ఇప్పటికే దిల్ రాజు తీసేసుకున్నారు. అయితే ఈ డీల్ ఇంకా ఫైనలైజ్ కాలేదని వినికిడి. గతంలో నిర్మాతకి, డిస్ట్రిబ్యూటర్ కి మధ్య ఉన్న పెండింగ్ పేమెంట్స్ ఇష్యూతో ఈ డీల్ క్లియర్ పిక్చర్ రాలేదని తెలుస్తోంది.

NTRs Rabhasa Business

సీడెడ్ విషయానికి వస్తే... ఏరియా వైజ్ అమ్ముతున్నట్లు తెలుస్తోంది. కర్నూలు కి ఏడు నుంచి ఏడున్నర కోట్ల మధ్య బిజినెస్ జరిగిందని వినికిడి. కర్ణాటక రైట్స్ ని వేణుగోపాల్ ... 3.75 ఎన్ ఆర్ ఎ కి తీసుకున్నారని, చెప్తున్నారు. కృష్ణా ఏరియాకి సురేష్ మూవిస్ వారు అడుగుతున్నారని, వారు సొంతం చేసుకోకపోతే అలంకార్ ప్రసాద్ తీసుకునే అవకాసం ఉంది. గుంటూరు, నెల్లూరు ఏరియాలకు హరి పిక్చర్స్ వారు డిస్కషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.


చిత్ర సమర్పకుడు బెల్లంకొండ సురేష్‌ మాట్లాడుతూ ''ఆది' తరవాత ఎన్టీఆర్‌తో తెరకెక్కిస్తున్న చిత్రమిది. దర్శకుడు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్న విధానం బాగుంది. ఎన్టీఆర్‌ డ్యాన్సులు, పోరాటాలు అభిమానులకు థ్రిల్‌ కలిగిస్తాయి'' అన్నారు.

దర్శకుడు చెబుతూ ''ఎన్టీఆర్‌ అభిమానులకు ఈ సినిమా పండగలా ఉంటుంది. ఆయనతో పనిచేయడం సంతోషంగా ఉంది. తమన్‌ చక్కటి పాటలిచ్చారు''అన్నారు. సంతోష్‌ శ్రీన్‌వాస్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'రభస'. ఈ చిత్రాన్ని ఆగస్టు 14న విడుదల చేయబోతున్నారు.

ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : తమన్‌ , ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.

English summary
NTRs Rabhasa ...Nellore Rights have been bagged by a New Party for 1.9Cr .
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu