»   » ఇంటి గోడలపై ఎందుకా రాతలు? తేలేది ఎల్లుండే

ఇంటి గోడలపై ఎందుకా రాతలు? తేలేది ఎల్లుండే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఆశిష్‌ గాంధీ, వంశీకృష్ణ, కునాల్‌ కౌశిక్‌, దీక్షాపంత్‌ శృతిమోల్‌, మనాలి ప్రధాన పాత్రల్లో రీడింగ్‌ లాంప్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై అశోక్‌ రెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఓ స్త్రీ రేపు రా చిత్రం అన్ని కార్యక్రమాలు పూరి చేసుకుని మార్చి 11న విడుదలకు సిద్దమైంది.

దర్శక నిర్మాత అశోక్ రెడ్డి మాట్లాడుతూ...'ఒకప్పుడు ఊళ్లో దెయ్యం తిరుగుతుందని, ఇండి గోడలపై ఓ స్త్రీ రేపు రా అని రాసుకునే వారు. కొన్నిచోట్లయితే భయంతో చాలా మంది వారు ఉంటున్న గ్రామాలను విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఈ హారర్ థ్రిల్లర్ కాన్సెప్టును సినిమాటిక్ గా, డిఫరెంటుగా ఉండాలని కో ప్రొడ్యూసర్ ప్రవీణ్ సపోర్టుతో 'ఓ స్త్రీ రేపు రా' చిత్రాన్ని రూపొందించాం. 'కల్పితమా..కచ్చితమా' ఉప శీర్షిక. టీమంతా చాలా ఇష్టపడి, కష్టపడి చేసిన సినిమా అన్నారు.

కథ కథనంలోనే కామెడి ఉంటుంది. ఈ చిత్రాని తీయడానికి శ్రమపడలేదు. కాని ప్రమోషన్‌, రిలీజ్‌కు మాత్రం మేము పడ్డ కష్టం అంత ఇంతకాదు. సినిమా చేయడం ఒక వంత్తు. దాని రిలీజ్‌ చేయడం ఒక ఎత్తుగా మారింది. సినిమాకి సెన్సార్‌ వారు కూడా చక్కగా ప్రొత్సాహించారు. ఇబ్బందులు పెట్టలేదు. థియేటర్లు దొరకక చాలా ఇబ్బందులు పడ్డాం.ఈ చిత్రాన్ని 70 థియేటర్లలో రిలీజ్‌ చేస్తున్నాం.

O Sthree Repu Raa Movie Gets a Release Date

ఈ చిత్రాన్ని తమిళ్‌లో కూడా రిలీజ్‌కు ప్లాన్‌ చేస్తున్నాం. ఈ చిత్రం యూనివర్శల్‌గా అన్ని ప్రాంతాల్లో వారికి కనెక్ట్‌ అవుతుంది. ఈ చిత్రం షూటింగ్‌ టైమ్‌లో అక్కడ దెయ్యం చూశాను. ఇక్కడ దెయ్యం చూశాను. అంటూ యూనిట్‌ సభ్యులే భయపడ్డారు. ఈ చిత్రం రిలీజ్‌ తరువాత ప్రేక్షకులు మంచి అనుభూతి పొందుతారు అన్నారు.

వైవా హర్ష, స్వప్నిక, షాన్, వీరబాబు, శ్యాంసుందర్, సోనాల్ ఘాన్సీ తదితరులు ఇతర తారాగణంగా నటించారు. ఈ చిత్రానికి మ్యూజిక్: జి.వి ఎడిటర్: రామాంజనేయ రెడ్డి, కెమెరా: సిద్ధం మనోహర్, దేవర హరినాథ్, సాహిత్యం: సుభాష్ నారాయణ్, పవన్ రాచేల్లి, స్క్రిప్ట్, డైలాగ్స్: పవన్ రాచేపల్లి, కో ప్రొడ్యూసర్: ప్రవీణ్ సాగి, కథ-నిర్మాణం-దర్శకత్వం: అశోక్ రెడ్డి

English summary
‘O Sthree Repu Raa’ movie’ is one more Telugu movie getting ready to hit the silver screens on 11th March 2016. Aasish Gandhi,Vamsikrishna Konduri,Kunal Kaushik,Deeksha Panth,Shruthi Mol,Manali Rathod are in the main lead roles directed and produced by Ashok Reddy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu