twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాక్సాఫీసు దారుణం: ‘ఆఫీసర్’ పేరెత్తడానికి కూడా నాగార్జున సిగ్గుపడాలేమో?

    By Bojja Kumar
    |

    ప్రతి నటుడికీ కెరీర్లో గొప్పగా చెప్పుకునే సినిమాలు ఉంటాయి. అదేవిధంగా ఇలాంటి సినిమా నేను చేశాను అని చెప్పుకోవడానికి ఇష్టపడని సినిమాలు సైతం ఉంటాయి. అయితే ఇది నా సినిమా అని చెప్పుకోవడానికి సిగ్గుపడే సినిమాలు కూడా కొన్ని ఉంటాయి. అలాంటి సినిమా నాగార్జున కెరీర్లో 'ఆఫీసర్' రూపంలో ఒకటి పడిపోయింది. నాగార్జున కెరీర్లోనే కాదు... తెలుగు సినిమా చరిత్రలోనే బాక్సాఫీసు వద్ద దారుణంగా ప్లాపైన చిత్రంగా నిలిచింది.

    ఇద్దరూ ఉద్ధండులే..

    ఇద్దరూ ఉద్ధండులే..

    ‘ఆఫీసర్' కథాంశం మంచిదే కావచ్చు... కానీ దాన్ని స్క్రీన్ మీద ఎగ్జిక్యూట్ చేసిన విధానమే దారుణంగా ఉంది, ఎంతలా అంటే ప్రేక్షకులు చీదరించుకునేంతలా! ఏదో కొత్త దర్శకుడు, అనుభవం లేదు అని అనుకోవడానికి కూడా ఇక్కడ ఆస్కారం లేదు. ఇండియాలోనే ది గ్రేటెస్ట్ డైరెక్టర్లలో ఒకరుగా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ, టాలీవుడ్లో అగ్రహీరోగా కీర్తి గడించిన నాగార్జున. సినిమాలు తీయడంలో అతడు దిట్ట అయితే.... హిట్ సినిమాలు ఎంచుకోవడంలో అపార అనుభవం ఉన్న హీరో ఇతడు.

    నాగార్జున ఇలా ఎందుకు చేశాడో?

    నాగార్జున ఇలా ఎందుకు చేశాడో?

    ఎంత పెద్ద యాక్టర్‌కు అయినా ప్లాపులు తప్పవు, గెలుపోటములు అనేది సహజం......ఇది ఎవరూ కాదనలేని సత్యం. కథ ప్రేక్షకులకు నచ్చనపుడే ఇలాంటివి జరుగుతాయి. కానీ ‘ఆఫీసర్' విషయంలో జరిగింది వేరు. సినిమా తీసిన విధానమే వారికి నచ్చలేదు. అంత అనుభవం ఉండి రామ్ గోపాల్ వర్మ ఇలాంటి సినిమా ఎందుకు తీశాడో?.... నటుడిగా ఇన్నేళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉన్న నాగార్జున... వర్మ అలా తీస్తుంటే ఎలా భరించాడో...? అభిమానులకు సైతం అంతుపట్టలేదు.

    రూ. కోటి కూడా రాలేదు

    రూ. కోటి కూడా రాలేదు

    మరీ దారుణమైన విషయం ఏమిటంటే.... ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లు. మొత్తం కలిపి కోటి రూపాలయ షేర్ కూడా రాలేదట. సాధారణంగా నాగార్జున రెమ్యూనరేషనే రూ. 5 కోట్ల వరకు ఉంటుందని టాక్. అందులో పావు వంతు కూడా సినిమా రాబట్టలేదంటే ఎంత అవమానం. నైజాంలో రూ.11 లక్షలు, సీడెడ్లో రూ. 17 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 14 లక్షలు, గుంటూరులో 8 లక్షలు, ఈస్ట్ లో రూ. 4 లక్షలు, వెస్ట్ లో రూ. 4 లక్షలు, కృష్ణలో రూ. 13 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 10 లక్షలు, ఓవర్సీస్ లో రూ. 15 లక్షలు.. ఇలా ఓవరాల్ కలెక్షన్ రూ. కోటికి మించలేదు.

    డామినేట్ చేసిన వర్మ బ్యాడ్ ఇమేజ్

    డామినేట్ చేసిన వర్మ బ్యాడ్ ఇమేజ్

    నాగార్జున స్థాయి హీరో అంటే కొద్దో గొప్పో ఓపెనింగ్స్ అయినా ఉంటాయి. కానీ ‘ఆఫీసర్' విషయంలో నాగార్జున ఇమేజ్‌ కంటే కూడా... చెత్త సినిమాలు తీస్తున్నాడనే రామ్ గోపాల్ వర్మ బ్యాడ్ ఇమేజ్ సినిమాపై ఎక్కువ ప్రభావం చూపినట్లు ఉంది.

    English summary
    Officer film is one of the biggest disasters in TFI history and biggest ever in Nagarjuna’s Career. The movie ended up it’s run worldwide with a distributor share of 1 cr.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X