OG Day 1 Collections Worldwide: పుష్ప 2 రికార్డు అవుట్..వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దుమ్మురేపిన ఓజీ.. పవన్ మూవీకి ఎ
టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత డీవీవీ ఎంటర్‌టైనర్ బ్యానర్‌పై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా దర్శకుడు సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్ OG. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించారు. థమన్ మ్యూజిక్ డైరెక్షన్‌లో రూపొందిన పాటలు ఈ సినిమాను భారీ హైప్‌ను ఇచ్చాయి.
బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఈ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు అర్జున్ దాస్, సీనియర్ నటులు ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫి, ఎఢిటింగ్ నవీన్ నూలీ నిర్వర్తించారు. ఇక ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? ప్రీమియర్లు, తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

ఓజీ సినిమాకు వచ్చిన హైప్‌తో తెలుగ రాష్ట్రాల్లోనే కాకుండా, కర్ణాటక, ఓవర్సీస్‌లో రికార్డు బిజినెస్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా బిజినెస్ 225 కోట్ల రూపాయలుగా నమోదైందని బిజినెస్ వర్గాలు వెల్లడించాయి. తెలుగు రాష్ట్రాల్లో ఓజీ (OG) సినిమా హక్కులు రికార్డు స్థాయిలో జరిగాయి. నైజాం, ఆంధ్రా, సీడెడ్‌లో భారీగా థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయి. ఈ సినిమా నైజాం థియేట్రికల్ రైట్స్ 60 కోట్ల రూపాయలు, ఆంధ్రా రైట్స్ 70 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 25 కోట్ల రూపాయల మేర రైట్స్ అమ్ముడుపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో 155 కోట్ల రూపాయల మేర అమ్ముడుపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. 165 కోట్ల షేర్.. 230 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించాల్సి ఉంటుంది.
ఇక తెలుగేతర రాష్ట్రాల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. కర్ణాటక, తమిళనాడు, కేరళ రైట్స్ సుమారుగా 15 కోట్ల రూపాయలు, హిందీ థియేట్రికల్ రైట్స్ 10 కోట్ల రూపాయల మేర జరిగాయి. ఇండియాలో ఈ సినిమా హక్కులు 190 కోట్ల రూపాయలుగా బిజినెస్ జరిగింది. ఇక ఓవర్సీస్ రైట్స్ సుమారుగా 60 కోట్ల రూపాయల మేర జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ 225 కోట్ల షేర్.. 450 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాల్లో టాక్.
ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ అమెరికాలో నెల రోజుల ముందే ప్రారంభమైంది. ఈ సినిమా ప్రీమియర్లకు దుమ్మురేగిపోయే కలెక్షన్లు నమోదు అయ్యాయి. కెనడాలో స్క్రీనింగ్ వివాదాలను పక్కనపెడితే.. ఈ చిత్రం యూఎస్ఏలో ప్రీమియర్ షోలకు 3 మిలియన్ డాలర్లు అంటే 27 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ మొత్తం పవన్ కల్యాణ్ కెరీర్‌లో హయ్యెస్ట్ కావడం విశేషంగా మారింది.
తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ల విషయానికి వస్తే.. ఆంధ్రా, నైజాం, సీడెడ్ అనే తేడా లేకుండా ఫ్రతీ చోట బాక్సాఫీస్‌ను చితక్కొటేసింది. ఈ సినిమా ఆంధ్రాలో 11 కోట్ల రూపాయల గ్రాస్, తెలంగాణలో 9 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక కర్ణాటకలో 3 కోట్ల రూపాయలు వసూలు చేసి గతంలో నమోదైన పుష్ప 2 పెయిడ్ ప్రీమియర్ల రికార్డులను బ్రేక్ చేసింది.
ఇక ప్రీమియర్లు, తొలి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ చిత్రం పెయిడ్ ప్రీమియర్ల ద్వారా 100 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఓవర్సీస్‌లో 27 కోట్లు, ఇండియాలో 80 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లతో ఈ సినిమా సెంచరీ కొట్టింది. ఇక ఇండియాలో తొలి రోజు 40 కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశం ఉంది. ఆంధ్రాలో 30 కోట్లు, తెలంగాణలో 26 కోట్లు, కర్ణాటకలో 7 కోటట్లు, తమిళనాడులో 1.5 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. మొత్తంగా ఈ సినిమా ప్రీమియర్లతో కలిపి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 160 నుంచి 180 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











