twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సమంత చిత్రం ‘ఓ బేబీ’ ఎంత వసూలు చేసింది?

    |

    సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మహిళా ప్రధాన చిత్రం 'ఓ బేబీ' విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని స్టార్ హీరోల సినిమాల స్థాయిలో భారీగా రిలీజ్ చేసింది. పైగా ఇతర పెద్ద సినిమాల పోటీ కూడా లేక పోవడంతో ప్రేక్షకులకు ఈ సినిమా తప్ప మరో ఆప్షన్ లేకుండా పోయింది. దీంతో ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సంతృప్తికర వసూళ్లు సాధిస్తోంది. ఒక మంచి ఫ్యామిలీ సబ్జెక్టుతో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి సమంత అండ్ టీమ్ నెల రోజుల ముందు నుంచే ప్రమోషన్స్ ప్రారంభించింది. వారు పడ్డ కష్టానికి సంతృప్తికర స్థాయిలో ఫలితాలు వస్తుండటం గమానార్హం.

    నైజాంలో వసూళ్లు ఎలా ఉన్నాయంటే...

    నైజాంలో వసూళ్లు ఎలా ఉన్నాయంటే...

    ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఓ బేబీ చిత్రం నైజాంలో తొలిరోజు రూ. 60 లక్షల షేర్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో రెండో రోజైన శనివారం వసూళ్లు పుంచుకున్నాయి. రూ. 75 లక్షల షేర్ వసూలు చేసింది. దీంతో 2 డేస్ టోటల్ వసూళ్లు రూ. 1.35 కోట్లకు చేరుకుంది.

    ఇతర ప్రాంతాల్లో పరస్థితి ఎలా ఉంది?

    ఇతర ప్రాంతాల్లో పరస్థితి ఎలా ఉంది?

    ఏపీలో తొలి రోజు వసూళ్లు వివరాలు మాత్రమే బయటకు వచ్చాయి. ఉత్తరాంధ్రలో ఫస్ట్ డే 21 లక్షలు, వెస్ట్ గోదావరి 6.8 లక్షలు, ఈస్ట్‌లో 8. 5 లక్షలు, క్రిష్ణా 17 లక్షలు, గుంటూరులో 18 లక్షలు, నెల్లూరు 3.5 లక్షలు, సీడెడ్‌లో 12 లక్షలు రాబట్టినట్లు తెలుస్తోంది. శని, ఆదివారం వసూళ్ల వివరాలు తెలియాల్సి ఉంది.

    ఓవర్సీస్ మార్కెట్లో పరిస్థితి ఎలా ఉంది?

    ఓవర్సీస్ మార్కెట్లో పరిస్థితి ఎలా ఉంది?

    ఓవర్సీస్ మార్కెట్లో సైతం ఈ చిత్రానికి ఆదరణ బావుంది. పీమియర్ షోల ద్వారా 300K డాలర్లు రాబట్టినట్లు తెలుస్తోంది. శనివారం ఇండియా-శ్రీలంక మ్యాచ్ ఉన్నప్పటికీ ఇటు ఇండియాతో పాటు ఇతర ప్రాంతాల్లో ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది.

    ఫస్ట్ వీకెండ్ ఎంత వసూలు చేస్తుందో?

    ఫస్ట్ వీకెండ్ ఎంత వసూలు చేస్తుందో?

    ‘ఓ బేబీ' చిత్రానికి సంబంధించి పూర్తి వసూళ్లపై ఫస్ట్ వీకెండ్ తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చిన్న బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ చిత్రం నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు మినిమం గ్యారంటీగా పెట్టుబడి రికవరీ చేస్తుందనే నమ్మకం అందరిలోనూ వ్యక్తమవుతోంది.

    ఓ బేబీ

    ఓ బేబీ

    స‌మంత అక్కినేని, ల‌క్ష్మి, నాగ‌శౌర్య‌, రావు ర‌మేష్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్ ప్ర‌ధాన తారాగ‌ణంగా బి.వి.నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, క్రాస్ పిక్చ‌ర్స్ ప‌తాకాల‌పై తెర‌కెక్కిన చిత్రం ` ఓ బేబీ`. సురేష్ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్ర‌సాద్‌, హ్యున్ హు, థామ‌స్ కిమ్ నిర్మాత‌లు.

    English summary
    Oh! Baby collected Rs 75 lakh share in the Nizam region, ending up with a 2-day share of Rs 1.35 crores. This is a great performance by a female-centric film. The film’s first weekend collections will be very huge.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X