For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Oke Oka Jeevitham Collections: శర్వానంద్ మూవీకి షాకింగ్ కలెక్షన్స్.. హిట్ టాక్‌తో ఇలాంటి వసూళ్లా!

  |

  సినీ బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా విలక్షణమైన నటన, విభిన్నమై చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు టాలెంటెడ్ హీరో శర్వానంద్. కెరీర్ ఆరంభంలోనే తనదైన చిత్రాలతో సత్తా చాటిన అతడు.. ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నాడు. అయితే, ఈ మధ్య కాలంలో శర్వానంద్ సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే అతడు 'ఒకే ఒక జీవితం' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు ఆరంభం నుంచే అదిరిపోయే టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్లు భారీగా వస్తాయని అంతా అనుకున్నారు. ఈ నేపథ్యంలో 'ఒకే ఒక జీవితం' మూవీ మొదటి రోజు బాక్సాఫీస్ రిపోర్టును చూద్దాం పదండి!

  ఒకే ఒక జీవితం అంటోన్న శర్వా

  ఒకే ఒక జీవితం అంటోన్న శర్వా

  శర్వానంద్ - శ్రీ కార్తీక్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే 'ఒకే ఒక జీవితం'. రీతూ వర్మ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో అమల, ప్రియదర్శి, వెన్నెల కిశోర్, నాజర్‌లు కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రభు నిర్మించారు. జాక్స్ బిజాయ్ ఈ మూవీకి సంగీతం అందించారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల అయింది.

  స్విమ్మింగ్ పూల్‌లో బిగ్ బాస్ భామ రచ్చ: తడిచిన బట్టల్లో అందాల ప్రదర్శన

  థియేట్రికల్ బిజినెస్ వివరాలివే

  థియేట్రికల్ బిజినెస్ వివరాలివే

  తెలుగు రాష్ట్రాల్లో శర్వానంద్‌కు పెద్దగా మార్కెట్ లేదు. దీనికితోడు ఈ మధ్య హిట్లు కూడా లేవు. దీంతో 'ఒకే ఒక జీవితం' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి రూ. 1.00 కోట్లు వ్యాపారం జరిగింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 7.50 కోట్ల బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

  మంచి టాక్‌తో.. ఆదరణ మాత్రం

  మంచి టాక్‌తో.. ఆదరణ మాత్రం

  ఏమాత్రం అంచనాలు లేకుండానే 'ఒకే ఒక జీవితం' మూవీ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. టైం ట్రావెల్ అండ్ ఎమోషనల్ సబ్జెక్టుతో రూపొందిన ఈ చిత్రానికి ఓవరాల్‌గా ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. కానీ, స్పందన మాత్రం అంతంతగానే వచ్చిందని చెప్పొచ్చు. దీంతో ఈ సినిమాకు తొలి రోజు కలెక్షన్లు పెద్దగా వచ్చే అవకాశం లేదన్న టాక్ వినిపించింది.

  Bigg Boss Telugu 6: ఆ అమ్మాయికి బిగ్ బాస్ షాక్.. పిరియడ్స్‌తో ఇబ్బంది.. రిక్వెస్ట్ చేసినా వినకుండా!

  తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు ఇలా

  తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు ఇలా


  చాలా కాలంగా శర్వానంద్ సరైన సక్సెస్ కోసం వేచి చూస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే అతడు సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో చేసిన సినిమానే 'ఒకే ఒక జీవితం'. క్రేజీ సబ్జెక్టుతో వచ్చిన ఈ చిత్రానికి తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. దీంతో ఈ మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి ఓపెనింగ్ డేన కేవలం రూ. 75 లక్షలు షేర్ మాత్రమే వచ్చింది.

  ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

  ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

  ఏపీ, తెలంగాణలో తొలిరోజు రూ. 75 లక్షలు మాత్రమే వసూలు చేసిన 'ఒకే ఒక జీవితం' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ పెద్దగా రాణించలేకపోయింది. ఫలితంగా కర్నాటక, రెస్టాఫ్ ఇండియా, తమిళ వెర్షన్లు కలిపి రూ. 10 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 45 లక్షలు మాత్రమే కలెక్ట్ చేసింది. దీంతో తొలి రోజు ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.30 కోట్లు షేర్‌ మాత్రమే వసూలైంది.

  టాప్ కిందకి జరిపి షాకిచ్చిన శ్యామల: ఇది అట్టాంటిట్టాంటి షో కాదుగా!

  టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి

  టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి


  శర్వానంద్ హీరోగా శ్రీ కార్తీక్ తెరకెక్కించిన 'ఒకే ఒక జీవితం' మూవీకి అంచనాలు లేకపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 8 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా మొదటి రోజు కేవలం రూ. 1.30 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 6.70 కోట్లు వస్తేనే ఇది హిట్ చిత్రంగా నిలుస్తుంది.

  రెండో రోజు నుంచి సత్తా చాటేలా

  రెండో రోజు నుంచి సత్తా చాటేలా


  టైం ట్రావెల్ కథతో ఎమోషనల్‌గా తెరకెక్కిన 'ఒకే ఒక జీవితం' మూవీకి టాక్‌తో పాటు రివ్యూలు కూడా పాజిటివ్‌గానే వచ్చాయి. కానీ, ప్రేక్షకుల నుంచి స్పందన మాత్రం అనుకున్న రేంజ్‌లో రాలేదు. దీంతో మొదటి రోజు కలెక్షన్లు ఆశించిన రీతిలో దక్కలేదు. అయితే, రెండో రోజు ఈ చిత్రానికి స్పందన పెరిగే అవకాశం ఉంది. దీంతో కలెక్షన్లు భారీగా రావొచ్చని అంటున్నారు.

  English summary
  Young actor Sharwanand Did Oke Oka Jeevitham Movie Under Shree Karthick Direction. This Movie Collects Rs 1.30 Cr in Day 1.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X