»   » దారుణంగా ‘ఓం నమో వెంకటేశాయ’ కలెక్షన్స్: నాగార్జునను బ్లేమ్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్లు

దారుణంగా ‘ఓం నమో వెంకటేశాయ’ కలెక్షన్స్: నాగార్జునను బ్లేమ్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: నాగార్జున, రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన భక్తిరస చిత్రం 'ఓం నమో వెంకటేశా' టాక్ బాగానే ఉన్నా... కలెక్షన్లు మాత్రం దారుణంగా ఉన్నాయట. హథీరామ్ బాబా జీవితంగా ఆధారంగా తీసిన ఈ సినిమా భారీ డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తోందని అంటున్నారు ట్రేడ్ వర్గాలు.

ఈ సినిమా తొలి వారాంతం కేవలం రూ. 7 కోట్లు మాత్రమే వసూలు చేసింది. సినిమాకు రూ. 36 కోట్లు వస్తే తప్ప గట్టెక్కే పరిస్థితి లేదు. తొలి వారాంతం చాలా దారుణంగా ఉన్న నేపథ్యంలో రికవరీ అసాధ్యమనే అంటున్నారు.

ఎవర్సీస్ లో ఈ సినిమా కంప్లీట్ వాష్ ఔట్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా బావుందనే టాక్ వచ్చినా ఇలాంటి పరిస్థితి ఏర్పడటానికి కారణం ఈ సమయంలో విడుదల చేయడమే, ఈ సమయంలో సినిమా విడుదల చేయాల్సింది కాదు నాగార్జునను బ్లేమ్ చేస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు.


 నైజాంలో దిల్ రాజ పరిస్థితి

నైజాంలో దిల్ రాజ పరిస్థితి

నైజాం ఏరియాలో ఈ చిత్రం రైట్స్ దిల్ రాజు రూ. 9 కోట్లకు కొన్నట్లు టాక్. ఈ సినిమా వల్ల ఆయనకు కనీసం 5 కోట్లు నష్టమనే టాక్ వినిపిస్తోంది. నాగార్జున తెలిసి తప్పు చేసారు

నాగార్జున తెలిసి తప్పు చేసారు

నాగార్జునకు బాక్సాఫీసు వద్ద ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలుసు? కానీ ఆయన తెలిసి కూడా ఈ సమయంలో రిలీజ్ చేసి తప్పు చేసారని అంటున్నారు. ఈ సినిమాను ఏదైనా పండగ సీజన్లోగానీ, పరీక్షల సీజన్ ముగిసిన తర్వాత సమ్మర్లో రిలీజ్ చేస్తే బావుండేది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఉత్తరాంధ్ర పరిస్థితి

ఉత్తరాంధ్ర పరిస్థితి


ఉత్తరాంధ్రలో ఓం నమో వెంకటేశాయ చిత్రాన్ని గాయిత్రి దేవి డిస్ట్రిబ్యూషన్ సంస్థ విడుదల చేసింది. ఈ చిత్రాన్ని వారు రూ. 2.87 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. వీరు కూడా భారీగానే నష్టపోయినట్లు టాక్. గత సినిమా కూడా అంతే

గత సినిమా కూడా అంతే

నాగార్జున, రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన గత సినిమా కూడా మంచి టాకే వచ్చినా కమర్షియల్ గా ఫెయిల్ అయింది. అయితే నమో వెంకటేశాయ అంత పెద్ద నష్టం మాత్రం కాదంటున్నారు డ్రేట్ పండితులు.లాభాలతో విపరీతంగా ఎంజాయ్ చేద్దామని కాదు, ఆదరించండి: బ్రహ్మానందం

లాభాలతో విపరీతంగా ఎంజాయ్ చేద్దామని కాదు, ఆదరించండి: బ్రహ్మానందం


ఓం నమో వెంకటేశాయ చిత్రాన్ని లాభాల కోసం తీయలేదని, భక్తిభావంతో తీసారని, మంచి సినిమాలు వచ్చినపుడు వాటిని ఆదరించాల్సిన బాధ్యత కూడా మనపై ఉందని బ్రహ్మానందం అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


English summary
'Om Namo Venkatesaya', the devotional flick based on the life of Hathi Ram Baba, is heading towards a Disaster status. First Weekend revenue is just around Rs 7 crore. There were no signs of recovery even during weekdays and all the Distributors are going to incur huge losses.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu