»   » ‘ఒంగోలు గిత్త' మూడు రోజుల కలెక్షన్స్

‘ఒంగోలు గిత్త' మూడు రోజుల కలెక్షన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్-కృతి కర్బంద కాంబినేషన్ లో 'బొమ్మరిల్లు' భాస్కర్ రూపొందించిన చిత్రం 'ఒంగోలు గిత్త' . ఈ చిత్రం మొన్న శుక్రవారం భారీగా ప్రపంచవ్యాప్తంగా విడుదల అయిన సంగతి తెలిసిందే. మార్నింగ్ షోకే నెగిటివ్ టాక్ తెచ్చుకన్న ఈ చిత్రం కలెక్షన్స్ విషయంలో వీకెండ్ లో బాగానే కలెక్టు చేసి నిర్మాత,పంపిణీదారులకు కొంతలో కొంత ఊరట ఇచ్చింది. ట్రేడ్ లో ... వినపడుతున్న కలెక్షన్స్ ఒకసారి చూస్తే...


'ఒంగోలు గిత్త' 3 రోజుల ఎపి షేర్....(ఏరియావైజ్)

నైజాం - 1.7 కోట్లు

సీడెడ్ -1.02 లక్షలు

వైజాగ్ - 69 లక్షలు

వెస్ట్ గోదావరి - 38 లక్షలు

ఈస్ట్ గోదావరి - 42 లక్షలు

కృష్ణా - 28 లక్షలు

గుంటూరు - 45 లక్షలు

నెల్లూరు - 22 లక్షలు

మొత్తం మూడు రోడుల ఎపి కలెక్షన్స్ షేర్ ... మొత్తం 5.16 కోట్లు


ఈ చిత్రంపై రామ్ చాలా నమ్మకంగా ఉన్నారు. క్లాస్ చిత్రాల దర్శకుడుగా పేరు తెచ్చుకున్న భాస్కర్ ...ఈసారి మాస్ ప్రేక్షకులను అలరించే దిసగా ఈ చిత్రం రూపొందించారంటున్నారు. మిర్చి యార్డ్ లో జరిగే ఈ కథ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని దర్శక,నిర్మాతలు హామీ ఇస్తున్నారు.

చిత్రంలో రామ్ అల్లరి చిల్లర పాత్రలకు కాస్త దూరంగా బాధ్యతలు తెలిసిన యువకుడిగా తొలిసారి కనిపిస్తున్నారు. కృతికర్బందా ఓ పెద్ద మహారాణిలా ఫీలవుతూ ఉంటుంది. పక్కా పొగరున్న అమ్మాయి. అయితే ఏంటట తొక్క! అంటూ పొగరు చూపే నాతో తనకి ఏంటి? అనేది ఆసక్తికం.

రామ్, కృతి కర్బందా, ప్రకాష్ రాజ్, అభిమన్యు సింగ్, డా. బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, అజయ్, రఘుబాబు, రమాప్రభ ముఖ్య పాత్రలు చేషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఫైట్స్: సెల్వ, ఫోటోగ్రఫీ: వెంకటేష్, ఆర్ట్: కె. కదిర్, పాటలు: వనమాలి, ప్రొడక్షన్ కంట్రోలర్: పి. రామ్ మోహన్ రావు, సమర్పణ: భోగవల్లి బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: భాస్కర్.

English summary
Ongole Gitta released and gets negitive talk. But Collectios wise it's ok. Bommarillu Bhaskar has made his comeback to direction two years after his failed attempt Orange in 2010. For his latest directorial venture Ongole Gitta, he has cast Ram and Kriti Kharbanda, who are looking for a big break of their career. But Ongole Gitta would not reached the Expectations.
Please Wait while comments are loading...