twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాలుగులో ఆ ఒక్కటే హిట్ (ట్రేడ్‌టాక్)

    By Srikanya
    |

    క్రిందటి వారం నాలుగు సినిమాలు భాక్సాఫీస్ ని ఆర్బాటంగా పలకరించాయి. వాటిల్లో ఎక్కువ హైప్ క్రియేట్ చేసిన చిత్రాలు బెజవాడ, ద డర్టీ పిక్చర్.మిగిలన రెండూ అల్లరి నరేష్ సంఘర్షణ, వరుణ్ సందేశ్ ప్రియుడు. వీటిల్లో కమర్షియల్ గా ప్రేక్షకాదరణ పొందిన ఏకైక చిత్రం 'ది డర్టీ పిక్చర్'. శృంగార తార సిల్క స్మిత జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో ఆమె జీవితంలో ఉన్న చీకటి కోణాలను తెరకెక్కించిందనే ఆసక్తి ప్రజల్లో లేపి,ఓపినింగ్స్ తెచ్చుకుని వాటిని నిలబెట్టుకుంది. అయితే బెజవాడ సినిమా అక్కడే ఫెయిలైంది. బెజవాడకు చేసిన విపరీతమైన పబ్లిసిటీ స్టంట్ జనాల్ని ధియోటర్ వరకూ రప్పించగలిగినా, లోపలకి వచ్చిన ప్రేక్షకుడుని తట్టుకోలేని దెబ్బ కొట్టింది. వర్మ మరో సారి జనాల్ని మోసం చేసాడని అంతా తిట్టుకునేలా చేసింది. బెజవాడ రౌడీయిజం గురించి చెప్తాడనుకుని ధియేటర్ కు వచ్చిన వారికి నాశిరకం గాఢ్ ఫాధర్,గాయం రీమేక్ సీన్స్, శివ సీన్స్ కాపీలు కనపడి తెల్లబోయేలా చేసాయి.

    దానికి తోడు నాగచైతన్య సైతం తన వయస్సుకన్నా పెద్ద పాత్రలో చేద్దామని చేసిన ప్రయత్నం సైతం తిరగపడింది. అతని ఖాతాలో మరో యాక్షన్ చిత్రం డిజాస్టర్ గా చేదు అనుభవం మిగిల్చింది. 'ది డర్టీ పిక్చర్'లో దర్శకుడు చెప్పదలుచుకున్న విషయంపై నిబద్దత కనిపిస్తే ఇక్కడ నూతన దర్శకుడు వివేక్ కు హింసను తెరపై చూపించి హిట్ కొట్టాలనే తాపత్రయమే కనపడింది. ఇక అల్లరి నరేష్ సినిమా సంఘర్షణ విషయానికి వస్తే ..నేను ఈ చిత్రంలో పదిహేడు సార్లు నవ్విస్తాను అని ఆర్బాటంగా చెప్పి తన వర్గాన్ని ధియేటర్ కి లాగే ప్రయత్నం చేసినా,నీరసమైన కథ,కథనాలు సినిమాని ఫ్లాఫ్ దిసగా ప్రయాణం కట్టించాయి. వరుణ్ సందేశ్ ప్రియుడు అయితే ఓపినింగ్స్ కూడా తెచ్చుకోలేక చతికిలపడింది. వరుణ్ సందేశ్ కి యూత్ లో క్రేజ్ ఉందని ఇప్పటికీ నమ్మి తిరిగే దర్శక,నిర్మాతలకు ఇది ఓ గుణఫాఠమే అని చెప్పుకోవాలి.

    English summary
    Only The Dirty Picture Dubbing version gets hit talk.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X