»   »  ‘మనం’లాగే ఓవర్ సీస్ లో కుమ్మేస్తోందిట

‘మనం’లాగే ఓవర్ సీస్ లో కుమ్మేస్తోందిట

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తెలుగు సినిమా కలెక్షన్స్ కి ఓవర్ సీస్ మార్కెట్ కూడా బాగా హెల్ప్ అవుతోంది. ఈ మధ్య కాలంలో మనం చిత్రంకు బాగా ప్లస్ అయ్యింది ఓవర్ సీస్ మార్కెటే. ఇప్పుడు మరో చిత్రం కూడా ఓవర్ సీస్ లో దున్నేస్తోందని చెప్తున్నారు. 'అష్టాచమ్మా'హీరో శ్రీనివాస్ అవసరాల దర్శకుడిగా మారాడు. వారాహి చలనచిత్రం, సాయి శివాని సమర్పణలో సాయి కొర్రపాటి ప్రొడక్షన్స్ పతాకంపై 'ఊహలు గుసగుసలాడే' చిత్రాన్ని రూపొందించారు. రజనీ కొర్రపాటి రూపొందించిన ఈ చిత్రంలో శౌర్య, రాశిఖన్నా జంటగా నటించారు. ఈ చిత్రంకి అక్కడ మంచి ఆదరణ దక్కటం సంతోషంగా ఉందని ప్రెస్ నోట్ ని విడుదల చేసారు నిర్మాతలు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ఓవర్సీస్ లో తొలి మూడు రోజుల్లోనే 48,232 డాలర్స్ వసూలు సాధించి సరికొత్త రికార్డును సాధించిందని చెప్పారు.

Oohalu Gusagusalade a massive hit overseas

శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ "ఈ కథను 15 నిమిషాల్లో సాయిగారికి చెప్పాను. నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారు. నేను కూడా ఓ పాత్రను చేద్దామనుకుని తర్వాత వద్దనుకున్నాను. కానీ సాయిగారు చేయమనడంతో చేసేశాను. 'అష్టాచమ్మా' చేసినప్పటి నుంచి నాకు కల్యాణిగారు బాగా తెలుసు. మంచి సంగీతాన్నిచ్చారు. శౌర్య, రాశి చాలా బాగా నటించారు'' అని అన్నారు.

చిత్ర సంగీత దర్శకుడు కల్యాణి కోడూరి మాట్లాడుతూ "మెలోడీలను చేయడానికి ఆసక్తి చూపుతాను. ఈ సినిమాలో నాలుగు పాటలున్నాయి. సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు రాసిన ఓ పాటకు రెండు రకాల ట్యూన్లు కట్టాం. అనంతశ్రీరామ్ రెండు పాటలను రాశారు. సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.

రావూ రమేష్, సూర్య, పోసాని కృష్ణమురళి, ఫృధ్వీ, సి.వి.ఎల్.నరసింహారావు, ప్రగతి, హేమ, సత్యకృష్ణ, విద్యారావు, వెంకట్ ఐమాక్స్, హరీశ్, సతీష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు: సిరివెన్నెల, అనంత్ శ్రీరామ్, కెమెరా: వెంకట్ సి.దిలీప్, సంగీతం: కల్యాణి కోడూరి, నిర్మాత: రజని కొర్రపాటి, రచన, దర్శకత్వం: శ్రీనివాస్ అవసరాల.

English summary
Producer Sai Korrapati’s latest flick “Oohalu Gusagusalade” collecting 48,232 dollars Overseas Box office in Just 3 Days.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu